లక్ష్యాన్ని మించి కొనుగొళ్లు


Fri,February 22, 2019 12:00 AM

జిల్లాలో ధాన్యం వెల్లువ
-వానకాలంలో 1,3,514 క్వింటాళ్ల కొనుగోలు
-జిల్లావ్యాప్తంగా 143 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
-తొలిరోజు నుంచి కేంద్రాలకు పోటెత్తిన ధాన్యం
-తూకాలు పూర్తయిన రెండురోజుల్లోనే డబ్బులు అందజేత
-41,51 మంది రైతుల ఖాతాల్లో రూ.245.16 కోట్లు జమ
-కస్టమ్ మిల్లింగ్ రైస్ 92,05 మెట్రిక్ టన్నుల సేకరణ
-ఇప్పటివరకు 72,46 మెట్రిక్ టన్నులు రాక
వానకాలం రైతులకు కలిసొచ్చింది. వర్షాలు పుష్కలంగా కురువడం, మిషన్ కాకతీయతో చెరువులు, కుంటలు నిండడంతోపాటు ప్రభుత్వం సాగుకు ఉచితంగా కరెంటు అందిస్తుండడంతో ధాన్యం దిగుబడి అంచనాలకు మించి వచ్చింది. జిల్లావ్యాప్తంగా 30,2 హెక్టార్లలో వరి సాగు చేయగా దాదాపు 1,9,300 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో కనీసం లక్ష టన్నుల ధాన్యాన్ని ఐకేపీ, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 143 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా అంతకుమించి 1,3,514 మెట్రిక్ టన్నులు సేకరించారు. ప్రభుత్వం ఏ గ్రేడ్‌కు రూ.1,770, సాధారణ రకానికి రూ.1750 మద్దతు ధర ఇవ్వడంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించారు. 41,51 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించగా వారి బ్యాంకు ఖాతాల్లో రూ.245.16 కోట్లను జమచేశారు. రేషన్‌బియ్యం కోసం ప్రభుత్వం మిల్లర్ల వద్ద నుంచి మార్చి 31 నాటికి 92,05 మెట్రిక్ టన్నులు సేకరించాలని టార్గెట్ నిర్దేశించగా ఇప్పటివరకు 72,46 మెట్రిక్ టన్నులు సేకరించింది.


కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసి దళారుల బెడద లేకుండా రైతుకు గిట్టుబాటు ధర అందించేందుకు ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా వానకా లం సీజన్‌లో 143 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసింది. ఇందులో భాగంగా ఐకేపీలు 95, పీఏసీఎస్ లు 4 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,3,514 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయడంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
జిల్లాలో 201-2019 వానకాలం సీజన్‌లో రైతులు 30,2 వేల హెక్టార్లలో వరిని సాగు చేయగా దాదాపు 1,9,300 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీనిలో లక్ష టన్నుల ధాన్యాన్ని ఐకేపీ, పీఏసీఎస్‌ల ద్వారా 143 కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకొని, లక్ష్యాన్ని మించి 1,3,514 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 41,51 మంది రైతుల వద్ద నుంచి కొనుగోలు చేశారు. రైతుల ఖాతాల్లో 245.16 కోట్ల రూపాయలను జమ చేశారు. ప్రభుత్వం ధాన్యానికి మద్దతు ధర ఏ - గ్రేడ్‌కు రూ.1,770, సాధారణ రకానికి రూ.1,750 మద్దతు ధరను అందించడంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించారు. ప్రభుత్వం ముందస్తుగానే కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లను చేసింది. ధాన్యానికి సరిపడా గన్నీ బ్యాగులు, మాశ్చరైజ్డ్ మిషన్లను తదితర వసతులు కల్పించడంతో కొనుగోళ్లు పెరిగాయి.

కస్టమ్స్ మిల్లింగ్ రైస్ టార్గెట్ 92,05 మెట్రిక్ టన్నులు..
ప్రభుత్వం ప్రజా పంపిణీకి అవసరమయ్యే బియ్యాన్ని సేకరించేందుకు కస్టమ్స్ మిల్లింగ్ రైస్ కోసం రైస్ మిల్లర్ల వద్ద నుంచి బియ్యం 92,05 మెట్రిక్ టన్నులు సేకరించాలని టర్గెట్‌ను 2019 మార్చి 31 వరకు ప్రభుత్వం నిర్దేశించింది. అందుకు గాను ఇప్పటికే రైస్ మిల్లర్ల నుంచి 72,46 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించింది. మిగతా 19,959 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మార్చి 31 లోపు సేకరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

యాసంగి ధాన్యం కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం..
జిల్లాలో రైతులు యాసంగి పంట కింద 23,776 హెక్టార్లలో వరిని సాగు చేశారని అధికారులు తెలిపారు. ఇందులో 1,54,544 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీనిలో 10 నుంచి 15 శాతం సీడ్‌కు పోగా మిగతా ధాన్యం సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం 154 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...