ఉత్తమ సేవలందించి ప్రజల మన్ననలు పొందండి


Thu,February 21, 2019 11:58 PM

-ప్రజల భాగస్వామ్యంతో ఆదర్శ క్షిగామాలుగా తీర్చిదిద్దుదాం
-అందరిని కలుపుకొని పనిచేయండి
-నూతన సర్పంచ్‌లకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే హరీశ్‌రావు
సిద్దిపేట అర్బన్: ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి.. అందరిని కలుపుకొని పనిచేయాలని నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు ఎమ్మెల్యే హరీశ్‌రావు దిశా నిర్దేశం చేశారు. గురువారం సిద్దిపేట ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలన్నారు. వివిధ శాఖల వారీగా సమీక్షిస్తూ ప్రజలకు తాగునీరు అందించడం ఆర్‌డబ్ల్యూస్ అధికారులదే బాధ్యత అన్నారు. తాగునీటి వృథాను అరిక మహిళా సంఘాలతో తీర్మానం చేయించాలని సూచించారు.

ఉపాధిహామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఉపాధిహామీ పథకం కింద వచ్చే నిధులు, వనరులు గ్రామాల అభివృద్ధికి వినియోగించుకోవాలన్నారు. పశువుల పాకల నిర్మాణంలో రాష్ట్రంలోనే సిద్దిపేట ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఈజీఎస్‌లో శ్మశానవాటిక, గ్రామ పంచాయతీ భవనాలు, పశువుల పాకలు, గొర్రెల షెడ్లు, సీసీరోడ్లు, పందిరి సాగు, ఇలా ఎన్నో పనులు చేసుకోవచ్చన్నారు. గ్రామ గ్రామాన నర్సరీలు ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనలు పాటించకుంటే సర్పంచ్‌లను తొలిగించే నూతన పంచాయతీరాజ్ చట్టం అమలులోకి వచ్చిందన్నారు.

పెండింగ్ భూ సమస్యలు పూర్తి చేయాలి
సిద్దిపేట మండలంలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను వెం టనే పరిష్కరించాలని తహసీల్దార్లను ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆదేశించారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో తిరిగి సమస్యలు పరిష్కరించాలన్నారు. నియోజకవర్గంలో పాడి సంపద పెరుగడంతో డెయిరీలలో పాల ఉత్పత్తి పెరిగేలా స్థానిక సర్పంచ్‌లు ప్రత్యేక చొరువ చూపాలన్నారు. పశుసంవర్థక శాఖ ఆధ్యర్యంలో పాడి పశువుల పథకం కింద ప్రైవేట్ రంగం నుంచి కాకుండా ప్రభుత్వ డెయిరీలకే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం, మిగతా వారికి 50 శాతం ఇబ్సిడీ ఇస్తుందన్నారు. సిద్దిపేట మండలంలో 49 మంది డీడీలు కట్టారని, అన్ని గ్రౌండింగ్ చేయాలన్నారు.

ఆసరా పెన్షన్‌లో అర్హులు మిగులొద్దు.. అనర్హులు రావొద్దు
ప్రభుత్వం ఏప్రిల్ నుంచి వెయ్యి రూపాయల నుంచి రూ.2016 పెంచిందని, వికాలంగులకు రూ.3016 పెంచిందన్నారు. ఇందుకు అర్హులను ఎంపిక చేయాలని, అనర్హులను చేర్చొద్దన్నారు. కార్యక్షికమంలో సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్‌డ్డి, ఎంపీపీ ఎర్రయాదయ్య, జడ్పీటీసీ గ్యార వజ్రవ్వ యాదగిరి, మండల పరిషత్తు ఉపాధ్యక్షుడు కోటగిరి శ్రీహరి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవన్‌కుమార్, డీఆర్‌డీఏ పీడీ నవీన్‌కుమార్, ఎంపీడీవో సమ్మిడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులు, జీఎం సత్యనారాయణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు, అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...