త్వరలో క్రాప్ కాలనీలు


Thu,February 21, 2019 11:55 PM

-రైతును బాగు చేయాలన్నదే సర్కారు లక్ష్యం
-రైతు బీమాతో ప్రతిరైతుకు మేలు
-కాళేశ్వరం నీళ్లతో ప్రతి చెరువు,కుంటను నింపుతాం
-పాడి రైతులకు 50 శాతం సబ్సిడీపై చాప్‌కట్టర్
-జీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ‘దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అనేక పథకాలను ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలిచింది.. ఇది మన రాష్ట్రానికి ఎంతో గర్వకారణం.. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ గొప్ప పథకం రైతు బీమాను తెచ్చారు’.. అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. గురువారం సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో నియోజకవర్గంలోని సిద్దిపేట అర్బన్, రూరల్, చిన్నకోడూరు, నంగునూరు మండలాలకు చెందిన 170 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు, 46 మంది అర్హులైన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను జాయింట్ కలెక్టర్ పద్మాకర్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలోనే సిద్దిపేట నియోజకవర్గంలో లక్షా 10 వేల ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు రానున్నాయని చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని చెరువులు, కుంటలు, బావుల్లో గోదావరి జలాలు వచ్చి చేరుతాయన్నారు. ఈ ఏడాది కాలం కాలేదని మరో రెండు నెలల్లో వేసవి కాలం వస్తున్న దృష్ట్యా పొలాలు ఎండుతాయని, బోర్లు వేసి అప్పుల పాలు కావద్దని రైతులకు సూచించారు. కొత్త బోర్లు వేయడంతో అప్పులవుతాయని చెప్పారు. సీఎం కేసీఆర్ తెచ్చిన రైతుబీమా పథకం అర్హులను గుర్తించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు రైతుల దగ్గరకు వస్తారని, అప్పుడు పూర్తి వివరాలు చెప్పడంతో పాటు నామిని వివరాలను రైతులు అందించాలని సూచించారు. రైతుబంధు పథకం కింద ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు పంటలకు రూ.వేలిస్తున్నదని, వచ్చే వానకాలం పంట నుంచి రూ.10 వేలు ఇవ్వనుందని చెప్పారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6 వేలు అందించనున్నట్లు తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలో మొత్తం 5,09 పట్టాదారు పాసుపుస్తకాలకు 55,576 మందికి మొదటి విడుతలో పంపిణీ చేసినట్లు తెలిపారు. రెండో విడుతలో 2,522 మందికి పంపిణీ చేసినట్లు వివరించారు. 3వేల పాసుపుస్తకాలను ప్రింటింగ్ కోసం పంపారని, మరో 15 రోజుల్లో వస్తాయని, వచ్చిన వెంటనే వాటిని పంపిణీ చేస్తామన్నారు. వందశాతం రెవెన్యూ, భూసమస్యలు లేని నియోజకవర్గంగా చేయడమే తమ లక్ష్యమన్నారు.

త్వరలో క్రాప్ కాలనీల ఏర్పాటు
రైతు సంక్షేమం కోసం త్వరలోనే క్రాప్ కాలనీలను ఏర్పాటు చేయబోతున్నామని, నియోజకవర్గ పరిధిలోని ఏ ప్రాంతంలో ఏ రైతులు ఏం పంటలు వేయాలో వ్యవసాయ అధికారులు పొలాల వద్దకు వచ్చి అవగాహన కల్పిస్తారని ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. అత్యంత పారదర్శకంగా ప్రజలకు మేలు చేకూరేలా ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చిందన్నారు. త్వరలోనే ధరిణి వెబ్‌సైట్ ద్వారా మండల తహసీల్దార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని చెప్పారు. ఇక ఆఫీసులు, అధికారుల చుట్టూ తిరగాల్సిన పని లేదని చెప్పారు. పట్టాదారు పాసుపుస్తకాలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. క్రాప్ ఇన్సూన్స్, రైతుబీమా, రైతుబంధు ఇలా అనేక పథకాలు లభించేలా మీ సమస్యలన్నింటినీ తీరుతాయని చెప్పారు.

పాడి రైతులకు 50 శాతం సబ్సిడీపై చాప్‌కట్టర్
పాడి రైతులకు 50 శాతం సబ్సిడీపై చాప్ కట్టర్స్ అందుబాటులో ఉన్నాయని, 50 శాతం సబ్సిడీతో తైవాన్ స్ప్రేయర్లు ఉన్నట్లు ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. సబ్సిడీపై టార్పాలిన్ కవర్లు అందించనున్నట్లు వివరించారు. సిద్దిపేట ఇంటిక్షిగేటెడ్ వెజ్ అండ్ నాన్ మార్కెట్‌లో రాత్రిపూట కూడా హోల్‌సేల్ వ్యాపారం జరుపుకునేలా త్వరలోనే ప్రారంభించనున్నట్లు వివరించారు. పేదింటి ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు వరంగా మారాయని, ఈ రోజున నియోజకవర్గ పరిధిలోని 4 మందికి రూ.7 లక్షల 7 వేలను అందించినట్లు తెలిపారు. పెండింగ్‌లో మరో 00 మంది లబ్ధిదారులు ఉన్నారని, వారికి త్వరలోనే అందించనున్నట్లు వివరించారు. అనంతరం కార్యక్షికమాన్ని ఉద్దేశించి జాయింట్ కలెక్టర్ పద్మాకర్ మాట్లాడారు. ఈ సమావేశంలో సుడా ఛైర్మన్ మారెడ్డి రవిందర్‌డ్డి, ఎంపీపీలు ఎర్ర యాదయ్య, మాణిక్‌డ్డి వివిధ గ్రామాల ప్రజావూపతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...