రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు


Wed,February 20, 2019 11:20 PM

మద్దూరు : మండలంలోని బెక్కల్ రామలింగేశ్వరస్వా మి బ్రహ్మోత్సవాల రెండో రోజు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సా యంత్రం వేళా భజనలు, సాంస్కృతిక కార్యక్రమాల తో పాటు రా త్రి వేళా అమ్మపురం కళాకారులచే నాటకాన్ని ప్రదర్శించారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ రామలింగేశ్వరస్వామి నామస్మరణతో మార్మోగాయి. రామలింగేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ చైర్మన్ తవిటి సంపత్‌తో పాటు ఆలయ పాలకవర్గ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా, పతంజలి యోగా శిక్షకుడు, సామాజిక కార్యకర్త బీర్కూరి మనోహర్ ఆలయాన్ని దర్శించుకొని రామచల క్షేత్ర వైభవాన్ని భక్తులకు వివరించారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...