‘కిసాన్ సమ్మాన్’ అందరికీ వర్తింపజేయాలి


Tue,February 19, 2019 11:08 PM

-రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
-జడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య
సంగాడ్డి టౌన్ : కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ పథకం అందరికీ వర్తింపజేయాలని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాగుల సారయ్య అన్నారు. మంగళవారం జడ్పీ 3వ, 5వ, 6వ స్థాయి సంఘ సమావేశాలు రాగుల సారయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎం సమ్మాన్ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందేలా చూడాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు. రైతుల వివరాలు సేకరణ పూర్తయిందని, మొదటి విడుత డబ్బులు ఈనెల 24 నుంచి అందజేయనున్నామని వివరించారు. లిస్టులో పేర్లు లేని రైతులు తమ పాస్‌బుక్ జిరాక్స్, వారి ఆధార్‌కార్డు జిరాక్స్ ఇస్తే ఈనెల 2 నుంచి వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తామన్నారు.

పశుసంవర్థ్ధక శాఖపై సమీక్షిస్తూ జిల్లాలో మొదటి విడుత గొర్రెల పంపిణీ పూర్తయి, రెండో విడుత పంపిణీ ప్రారంభమైందన్నారు. జీవాలకు మేత కోసం ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గడ్డి విత్తనాలను సబ్సిడీపై అందిస్తున్నామని పశుసంవర్థ్దక శాఖ అధికారులు తెలిపారు. వైస్ చైర్మన్ సారయ్య మాట్లాడుతూ గ్రామాల్లో గొర్రెలు, మేకలను కుక్కలు కరిచి చంపుతున్నాయని, ఆ విధంగా కాకుండా వాటికి షెడ్లు నిర్మించుకునేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమ ప్రభుత్వమని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు కృషి చేయాలన్నారు. జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు అమీనొద్దీన్ మాట్లాడుతూ కొండాపూర్ మండలంలో పాల శీతలీకరణ కేంద్రం మంజూరు చేసి నిర్మించినా ఇంతవరకు ప్రారంభించలేదని, ఎప్పుడు ప్రారంభిస్తారని అధికారులను ప్రశ్నించారు. మరో వారంలో రోజుల్లో ప్రారంభించి పాడి రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు తెలిపారు.

మత్స్యశాఖపై సమీక్షిస్తూ సింగూరు ప్రాజెక్టులో ప్రభుత్వం నుంచి నీలకంఠ రొయ్యలను 29 లక్షలు వదిలామని అధికారులు తెలిపారు. అదే విధంగా జిల్లాలో 500 మంది మత్స్యకారులకు లైసెన్స్‌లు రెన్యూవల్ చేయడం జరిగిందని, అదే విధంగా చేపలు విక్రయించుకునేందుకు సబ్సిడీపై వాహనాలను అందించామని వివరించారు. సివిల్ సప్లైపై సమీక్షిస్తూ నూతనంగా రేషన్‌కార్డులలో కొత్త పేర్లు చేర్చడం, చనిపోయిన వారి పేర్లు తొలిగిస్తున్నామని ఆ శాఖ అధికారులు తెలిపారు. అదే విధంగా ఉజ్వల గ్యాస్ పథకం ద్వారా నిరుపేదలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నామని వివరించారు.

జిల్లాలో బయోమెవూటిక్ ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నామని ఎక్కడా కూడా దుర్వినియోగం కావడం లేదన్నారు. దీనికి సభ్యు లు వీఆర్‌వోలకు బయోమెవూటిక్ రాని వారికి సరుకులు ఇవ్వాలని అప్పజెప్పారని, రేషన్ డీలర్లు, వీఆర్‌వోలు కలిసి సరుకులను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. స్పందించిన అధికారులు త్వరలో జిల్లాలో ఐరీస్ వస్తుందని, ఎలాంటి తప్పులు లేకుండా అందరికీ సరుకులు అందుతాయన్నారు. అనంతరం సంక్షేమం, ఐసీడీఎస్‌పై సమీక్షించారు. సమావేశంలో అకౌంట్స్ అధికారి ఎం.సుధీర్, కో-ఆప్షన్ సభ్యుడు అమీనొద్దీన్, ఎస్‌డీ మొయిజొద్దీన్, జడ్పీటీసీలు శ్రీనివాస్‌డ్డి, మంగేశ్వరి, గుండు స్వప్న, కర్ణ శోభారాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...