సీఎం కేసీఆర్.. కారణజన్ముడు


Sun,February 17, 2019 11:14 PM

-ఎల్లమ్మ దేవాలయంలో ఎమ్మెల్యే పూజలు
- పెద్దమాసాన్‌పల్లిలో వాటర్ ప్లాంట్, వడ్డెర కాలనీలో బస్ షెల్టర్ ప్రారంభం
- సైనికుల కుటుంబాలకు ప్రగాడ సంతాపం
- దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి
తొగుట : అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతోపాటు దేశంలోనే రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్.. కారణజన్ముడని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని పెద్దమాసాన్‌పల్లిలో ఎల్లమ్మ కల్యాణోత్సవాల్లో పాల్గొని సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. అ నంతరం సర్పంచ్ మెట్టు వరలక్ష్మి, స్వామి దంపతులు తన దివంగత కుమార్తె రేఖ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన సురక్షిత వాటర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే, ఎల్లమ్మ ఆలయంలో గ్రామానికి చెందిన పన్యా ల ప్రవీణ్‌కుమార్ ఉచితంగా ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకర్, వడ్డెర కాలనీలో పన్యాల లక్ష్మమ్మ,రాంరెడ్డిల జ్ఞాపకార్ధం నిర్మించిన బస్ షెల్టర్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మల్లన్న సాగర్ ద్వారా పంటపొ లాలకు సాగునీరు అందిస్తామన్నారు. పెద్దమాసాన్‌పల్లిలో 10వ తరగతి ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని ఎంఈవో యాదవరెడ్డికి ఎమ్మెల్యే సూచించారు. పెద్దమాసాన్‌పల్లిలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు దుద్దెడ మల్లేశం కుటుంబానికి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ వీర్‌సింగ్‌ను ఆదేశించారు. పెద్దమాసాన్‌పల్లిలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల మంజూరుతోపాటు గ్రామ పంచాయతీ భవనం, తుక్కాపూర్ బీటీ రోడ్డును డబుల్ రోడ్డుగా, సబ్ స్టేషన్‌ను మంజూరు చేశానని తెలిపారు. ఎల్లమ్మ ఆలయం వద్ద మినీ ఫంక్షన్ హాల్, వడ్డెర కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో ఎంపీపీ రేణుక రవీందర్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు చిలువేరి మల్లారెడ్డి, రైతు సమన్వ య సమితి మండల కోఆర్డినేటర్ ఏల్పుల స్వామి, సొసైటీ చైర్మన్ మల్లేశం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కనకయ్య, సర్పంచ్‌లు వరలక్ష్మీస్వామి, ఎల్లం, గోవర్ధన్‌రెడ్డి, నర్సింలు, చంద్రం, మాజీ సర్పంచ్‌లు భా స్కర్, రాజగౌడ్, నేతలు ఎల్లారెడ్డి, రాంరెడ్డి, నరేందర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ఎల్లం, కనకయ్యగౌడ్, భిక్షపతి గౌడ్, లకా్ష్మరెడ్డి, బ్రహ్మానందారెడ్డి, రమేశ్, యాదగిరి, బండారు స్వామిగౌడ్, పిట్ల వెంకటేశ్ పాల్గొన్నారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...