సర్పంచ్‌లు అంకిత భావంతో పనిచేయాలి


Sun,February 17, 2019 11:13 PM

సిద్దిపేట అర్బన్ : సర్పంచ్‌లు అంకిత భావంతో పనిచేసి ప్రజల మధ్యలో ఉండి క్షేత్రస్థాయిలో వారిని సమన్వయపర్చుతూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు. ఆదివారం సుడా కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని చిన్నకోడూరు, చిన్నకోడూరు, సిద్దిపేట రూరల్ మండలాల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రగతిపై స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీడీవోలు, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక నర్సరీ, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డుల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, ఎంపీపీలు ఎర్ర యాదయ్య, జాప శ్రీకాంత్‌రెడ్డి, కూర మాణిక్యరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మతో పాటు వివిధ మండలాల ఎంపీడీవోలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
* ఎమ్మెల్యేను కలిసిన జలాల్‌పూర్ సర్పంచ్ కృష్ణ
మెదక్ జిల్లా నర్సపూర్ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం జలాల్‌పూర్ సర్పంచ్ కృష్ణ ఆధ్వర్యంలో 54 మంది గ్రామస్తులు సుడా కార్యాలయంలో ఎమ్మెల్యే హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు. అంతకు ముందు జలాల్‌పూర్ గ్రామస్తులు ఇబ్రహీంపూర్‌ను సందర్శించి అక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...