రైల్వేలైన్ నిర్మాణ పనులు వేగవంతంగా చేయాలి


Sun,February 17, 2019 12:06 AM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : జిల్లాలోని మనోహరబాద్ - కొత్తపల్లి రైల్వేలైన్ నిర్మాణం కోసం గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో పనులు దాదాపు పూర్తి కావొచ్చాయని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శనివారం సమీకృత కలెక్టరేట్‌లో మనోహరబాద్- కొత్తపల్లి రైల్వేలైన్ నిర్మాణ పనుల ప్రగతిపై రైల్వేశాఖ సీఈ సుబ్రమణ్యంతో కలెక్టర్ కృష్ణభాస్కర్, జేసీ పద్మాకర్, డీఆర్‌వో చంద్రశేఖర్, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సుతో కలిసి సమీక్షించారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్, సుడా, రిజస్ట్రేషన్ల శాఖ, మున్సిపాలిటీ అధికారులతో జిల్లా, సిద్దిపేట నియోజకవర్గ ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ రైల్వేలైన్ నిర్మాణ పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉన్న అంశాలను అడిగి తెలుసుకున్నారు. రైల్వేలైన్ పనుల గురించి రీచ్ 1,2,3 అంశాలపై సమీక్షిస్తూ పనుల కోసం కావాల్సిన ప్రతిపాదనలకు వివిధ శాఖల పరంగా ఇవ్వాల్సిన అనుమతులను ఆమోదించాలని మైనింగ్, విద్యుత్, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులను ఫోన్‌లైన్‌లో కోరారు. గజ్వేల్ నియోజకవర్గంలో దాదాపు రైల్వేలైన్ పనులు పూర్తి కావొచ్చాయని, సిద్దిపేట నియోజకవర్గంలో చేపట్టాల్సిన పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని రైల్వే సీఈ సుబ్రమణ్యం, డీఆర్‌వో చంద్రశేఖర్‌లకు సూచించారు. ఈ మేరకు పాత అలైన్‌మెంట్ ప్రకారం కాకుండా కొత్త అలైన్‌మెంట్ రైల్వేలైన్ విషయంపై ప్రజాప్రయోజనాల దృష్ట్యా వారికి అవసరమయ్యే విధంగా అంశాలను ప్రతిపాదించాలని కలెక్టర్ కృష్ణభాస్కర్, సీఈ సుబ్రమణ్యంలను ఎమ్మెల్యే కోరాడు.

అనుమతులు లేని లేఅవుట్ల రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలి
సుడా పరిధిలో అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్ల ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని అర్బన్ రిజిస్ట్రార్‌కు ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆదేశించారు. సుడా అనుమతి తీసుకున్న తరువాత రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు. ప్రతి లేఅవుట్‌లోను 30 నుంచి ఫీట్ల వరకు రోడ్డు ఉండాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. లేఅవుట్ వేసేందుకు రూ.10వేల డీడీ కట్టి 10శాతం లేఅవుట్‌కు ఉచితంగా ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయని కలెక్టర్ కృష్ణభాస్కర్, జేసీ పద్మాకర్‌లు తెలిపారు. 40ఫీట్ల రోడ్డులో 10శాతం ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు. 5ఎకరాల వరకు 40నుంచి 33ఫీట్లు రోడ్డు ఉం డాలని సూచించారు. సిద్దిపేట పట్టణ సుడా పరిధిలో 40 ఫీట్ల రోడ్లు తప్పనిసరిగా ఉండాలని, గ్రామ పంచాయతీ 44 ఫీట్ల రోడ్డుకు 10శాతం పంచాయతీ పరిధిలోకి భూమి పోతుందని, దాన్ని 5శాతానికి తగ్గించాలన్నారు. కార్యక్రమంలో సుడా డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...