‘ఇండోర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీసుకుందాం’


Wed,February 13, 2019 11:45 PM

దుబ్బాక టౌన్ : మధ్యవూపదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ మున్సిపాలిటీని స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఆదర్శంగా తీసుకోవాలని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య సూచించారు. ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో జరుగుతున్న స్వచ్ఛత పనులను కమిషనర్ నర్సయ్య పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఇండోర్ నుంచి ఆయన ఫోన్‌లో మాట్లాడుతూ...గత మూడేండ్లుగా ఇండోర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ దేశంలోనే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మొదటి స్థానంలో నిలుస్తుందని అందుకుగాను అక్కడ జరుగుతున్న స్వచ్ఛత పనుల పర్యవేక్షణ, అవగాహన కోసం హైదారాబాద్ జోన్‌లోని 50 మంది మున్సిపల్ కమిషనర్ల బృందం ఇండోర్‌లో పర్యటిస్తుందన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో మొదటి రోజైన మంగళవారం ఇండోర్ మున్సిపాలిటీ తీసుకుంటున్న చర్యలపై అక్కడి అధికారులు అవగాహన కల్పించారని రెండో రోజైన బుధవారం పట్టణంలో క్షేత్రస్థాయి పర్యటన జరిపామన్నారు. డోర్‌టుడోర్ చెత్త సేకరణ, తడి,పొడి చెత్తను వేరు చేయడం, వాహనాల్లోనే ప్యాకింగ్ చేసి డంప్ యార్డుకు తరలించే విధానాన్ని పరిశీలించామన్నారు. తడి చెత్తను ఎరువుగా మార్చడం, మురికి నీటిని ఫ్యూరిఫికేషన్ చేయడం వంటి విధానాన్ని పరిశీలించామని కమిషనర్ నర్సయ్య తెలిపారు. అదే విధంగా చెత్తతో గ్యాస్ తయారీ, ప్లాస్టిక్ కవర్లతో డీజిల్, పెట్రోల్ తయారి వంటి పనులను పరిశీలించామన్నారు. రోడ్లను శుభ్రపరిచే విధానాన్ని అధికారులు తీసుకుంటున్న చర్యల విషయమై సిబ్బందిని క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నామన్నారు. ఇండోర్ పట్టణం గత ఐదేండ్లుగా పక్కా ప్రణాళికతో స్వచ్ఛత దిశగా అడుగులు వేసిందని అందుకే దేశ స్థాయిలో నెంబర్‌వన్‌గా నిలిచందని దుబ్బాకను సైతం అదే స్ఫూర్తితో ముందుకు తీసుక ప్రణాళికలు సిద్ధ్దం చేశామన్నారు. ప్రజల సహకారంతో దేశ స్థాయిలో గుర్తింపు పొందేందుకు ముందుకు సాగుదామని కమిషనర్ నర్సయ్య పిలుపునిచ్చారు.

143
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...