కూరగాయల సాగులో మెలకువలు పాటించాలి


Wed,February 13, 2019 11:43 PM

- ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖజిల్లా అధికారి కె.రామలక్ష్మి
- సిద్దిపేట, చేర్యాల, హుస్నాబాద్ ప్రాంతాల రైతులకు అవగాహన కార్యక్రమం
సిద్దిపేట అర్బన్ : జిల్లాలో కూరగాయలు, మామిడి తోటలు, ఇతర పంటలను సాగు చేస్తున్న రైతులు ఎప్పటికప్పుడు మెలకువలు పాటిస్తూ, తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిక్షిశమశాఖ అధికారి కె.రామలక్ష్మి సూచించారు. బుధవారం సిద్దిపేటలో సిద్దిపేట, చేర్యాల, హుస్నాబాద్ ప్రాంతాల రైతులకు కూరగాయల సాగు, మామిడి పండ్ల తోటల సాగుపై అ వగాహన కల్పించారు. ముందుగా కూర గాయల సాగులో మెలకువలు, మామిడి తోటల్లో కొమ్మ కత్తిరింపులు, పూత పిందె, సమయంలో చేపట్టాల్సిన వివిధ యాజమాన్య పద్ధతులు, నీటి యా జమాన్యం వివరించారు. అలాగే, తెగుళ్లు, క్రిమికీటకాల నివా రణ చర్యలపై నెటాఫిన్ కంపెనీ దక్షిణ భారతదేశ ప్రాంతీయ అగ్రానమిస్ట్ సుబ్బారావు వివరించారు. ఈ సందర్భంగా ఆయన దృశ్య శ్రవణ పరికరాలతో పవర్ పాయింట్ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. జిల్లా అధికారి రామలక్ష్మి మాట్లాడు తూ.. మామిడిలో పూత, పిందె స మయాల్లో ఆశించే బూడిద తెగులు, తేనెమంచు పురుగులను సమర్థవంతంగా నివారిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చ న్నా రు. రసాయనిక ఎరువులతోపాటు సేంద్రియ ఎరువులను వినియోగించి, సాగు ఖర్చును తగ్గించుకోవాలని సూచించారు. రసాయన అవశేశాలు లేని పంటలు సేం ద్రియ పంట ఉత్పత్తులను పండించాలని సూచించారు. కార్యక్షికమంలో సిద్దిపేట ఉద్యానశాఖ అధికారి సైదులు, అధికారులు ధీరజ్, మమత, రవళి, ఉద్యాన క్షేత్రస్థాయి అధికారులు రమేశ్, సంగయ్యస్వామి, శ్రీకాంత్‌డ్డి, మహేశ్, సుధాకర్‌డ్డి, రైతులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...