పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి


Wed,February 13, 2019 11:42 PM

- సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్‌డ్డి
సిద్దిపేట రూరల్ : పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి మండలానికి మంచిపేరు తీసుకురావాలని సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్‌డ్డి అన్నారు. బుధవారం మండలంలోని నారాయణరావుపేటలో ఐకాన్ యూత్ ప్రతినిధులు నిర్వహించిన మండలస్థాయి టాలెంట్ టెస్టు విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ భోధనతో పాటు నాణ్యమైన భోజనం లభిస్తుందన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్విని యోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ప్రతి సంవత్సరం పదో తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్టులు నిర్వహిస్తూ ప్రోత్సహిస్తున్న ఐకాన్ యూత్ సభ్యులను అభినందించారు.
కార్యక్షికమంలో సర్పంచ్ మాస శశి యాదయ్య, ఉప సర్పంచ్ స్వామి, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. కాగా. మండల స్థాయిలో టాలెంట్ టెస్టులో ఇర్కోడు ఆదర్శ పాఠశాల విద్యార్థులకు 1, 2, 3, 4, 6, 7, బహుమతులు రావడంపై పాఠశాల ప్రిన్సిపల్ నాగరాజును ఎంఈవో గోపాల్‌డ్డి అభినందించారు.
ప్రత్యేక తరగతులు ప్రారంభం..
కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : పదో తరగతి విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదివి, మంచి మార్కులు సాధించాలని కౌన్సిలర్ చిప్ప ప్రభాకర్ అన్నారు. బుధవారం సిద్దిపేట మల్టీపర్పస్ హైస్కూల్‌లో ఇన్‌చార్జి హెచ్‌ఎం లక్ష్మయ్య, ఉపాధ్యాయుడు భగవంతయ్యతో కలిసి పదో తరగతి విద్యార్థుల ప్రత్యేక తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంచి ఫలితాలు సాధించి పాఠశాలకు పేరు తీసుకరావాలన్నారు. పదో తరగతి విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు సమకూర్చుతామని ఆయన తెలిపారు.

ప్రభుత్వ కళాశాలల్లోనే చేరాలి..
కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : ప్రభుత్వ కళాశాలల్లో చేరి ఉన్నత విద్యావంతులుగా ఎదుగాలని మున్సిపల్ కౌన్సిలర్ చిప్ప ప్రభాకర్ అన్నారు. బుధవారం జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బాలకిషన్‌తో కలిసి స్థానిక ప్రభుత్వ బాలుర పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు కేరీర్ గైడెన్స్ వివరించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుందన్నారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు సిద్దిపేటను విద్యాక్షేవూతంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. ప్రభుత్వ కళాశాలల్లోనూ ప్రైవేటు, కార్పొరేటు కళాశాలలకు ధీటుగా బోధన జరుగుతుందన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చేరిన విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్‌షిప్‌తోపాటు పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందిస్తుందన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న కోర్సులను ప్రిన్సిపాల్ బాలకిషన్ వివరించారు. కార్యక్షికమం లో అధ్యాపకులు సుధాకర్, కనకచంద్రం, రవీందర్‌డ్డి, సత్యనారాయణ, వెంకటరమణ, రఘురాజు, గంగాధర్, ఫాతిమ, పుష్పలత, శ్రీనివాస్, రేవంత్, నవనీత, రజిత తదితరులు పాల్గొన్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...