నిఘా నేత్రాల నీడలో పల్లెలు..


Sun,December 9, 2018 11:23 PM

మద్దూరు: సమాజంలో నానాటికి పెరుగుతున్న నేరాలను నియంత్రించి, శాంతిభద్రతలను పరిరక్షించాలనే సదుద్దేశ్యంతో పోలీస్ ఉన్నతాధికారులు వినూత్నమైన పద్దతులకు శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలో పట్టణాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు శాంతిభద్రతల పర్యవేక్షణలో పోలీస్ శాఖ విజయవంతమైంది. ఒక్కో సీసీ కెమెరా వందమంది పోలీస్ కానిస్టేబుళ్లతో సమానమని భావించిన పోలీస్ ఉన్నతాధికారులు ప్రస్తుతం గ్రామాల్లో పెద్ద ఎత్తున సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా పోలీస్ కమీషనర్ జోయల్ డెవిస్ ఆదేశాల మేరకు ఎస్‌ఐ పాడి రాజిరెడ్డి నేతృత్వంలో మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. గత ఆగస్టు మాసంలో మండలంలోని పలు గ్రామాల్లో సీసీ కెమెరాలను సీపీ జోయల్‌డెవిస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌కు అనుసంధానం చేసి శాంతిభద్రతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దీంతో గ్రామాల్లో నేరాల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతుంది.
20 పంచాయతీ పరిధిలో
103 సీసీ కెమెరాల ఏర్పాటు..
మండలంలోని 23 గ్రామ పంచాయతీల పరిధిలో ఇప్పటి వరకు 103 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. మద్దూరు-03, రేబర్తి-08, వల్లంపట్ల-04, బైరాన్‌పల్లి-10, లద్నూర్-06, బెక్కల్-06, సలాఖపూర్-04, మర్మాముల-04, నర్సాయపల్లి-09, అర్జున్‌పట్ల-04, కమలాయపల్లి-03, దూల్మిట్ట-05, జాలపల్లి-05, కొండాపూర్-04, కూటిగల్-07, గాగిళ్లాపూర్-06, లింగాపూర్-05, వంగపల్లి-04, తోర్నాల-03, ధర్మారం-03 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ఆర్ధికంగా చేయుతనందించేందుకు అన్ని గ్రామాల్లోని వ్యక్తులు, వివిధ కులసంఘాలు, మహిళా, యువజన సంఘాల ప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకురావడం జరుగుతుంది. దీంతో ప్రజల సహకారంతో పోలీసులు మండలంలో ఇప్పటి వరకు 103 సీసీ కెమెరాలను ,మరో 2వందలకు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు పోలీసులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
త్వరలో కమాండింగ్ కంట్రోలురూం ఏర్పాటు
గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో కమాండింగ్ కంట్రోలురూంను ఏర్పాటు చేసేందుకు పోలీస్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి కావల్సిన ఆర్థ్ధిక వనరులను పోలీసులు వివిధ వర్గాల నుంచి సమీకరిస్తున్నారు. ముఖ్యంగా సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల పోలీసులకు సత్ఫలితాలను ఇస్తున్నాయి. గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వల్ల దూల్మిట్టలో మర్డర్ కేసును ఛేదించారు. అదేవిధంగా గ్రామాల్లో అక్రమంగా నిర్వహంచే బెల్ట్‌షాపులను పోలీసులు నియంత్రించారు.
- ఎస్‌ఐ రాజిరెడ్డి

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...