కష్టంతో కాకుండా ఇష్టంతో చదువాలి


Mon,November 12, 2018 11:32 PM

సిద్దిపేట అర్బన్:పట్టుదల, లక్ష్యం సాధన దిశగా కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే అనుకున్న సాధించవచ్చని కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లి లోని గురుకుల బాలికల విద్యాలయంలో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌ను సీపీ జోయల్ డెవిస్‌తో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, సమస్యలు చుట్టు ముట్టినా వాటిని అధిగమించి ఉన్నత స్థాయికి ఎదుగాలని కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు. ఇస్రో చైర్మన్ స్వగ్రామంలో ఎన్నో సమస్యలుండేవన్నారు అయినా ఆయన ఎంతో ఉన్నతస్థాయికి ఎదిగారన్నారు. సిద్దిపేటలో విద్యార్థులకు సకల సౌకర్యాలు ఉన్నాయన్నారు. సైన్స్ ఫెయిర్, సైన్స్ అంటే ఏంటని పలువురు బాలికలను అడుగగా పలువులరు పలు రకాలుగా సమాధానమిచ్చారు. సైన్స్‌తో ఉజ్వల భవిష్యత్తుకు పునాధులు వేసుకోవాలన్నారు. సమాజంలో విషయాన్ని నిజమని నిర్ధారించినపుడు అది సైన్స్‌గా భావించవచ్చన్నారు. కొందరు నిజాలు కాని వాటిని కూడా సైన్స్‌గా చిత్రీకరిస్తారన్నారు. అది కరెక్టు కాదన్నారు. సీపీ మాట్లాడుతూ ప్రముఖ శా్రస్త్రవేత్తలను స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ఉన్నతస్థాయికి ఎదుగాలన్నారు. విద్యార్థిదశ ఎంతో ఎంతో ముఖ్యమన్నారు. లక్ష్యం దిశగా ముందుకు సాగితే విజయం సాధించవచ్చన్నారు.

జిల్లా విద్యాశాఖాధికారి రవికాంతరావు మాట్లాడుతూ జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌కు జిల్లా వ్యాప్తంగా పాఠశాలల విద్యార్థులు, గైడ్ టీచర్లు వచ్చారన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే సైన్స్ ఎగ్జిబిషన్‌లో జీవితంలో సవాళ్లు-శాస్త్ర సాంకేతిక పరిష్కారాలు అనే అంశంపై విద్యార్థులు ఉత్సాహంగా ఎగ్జిబిట్లు తయారు చేశారనారు. జిల్లా వ్యాప్తంగా 278 పాఠశాలలనుంచి 304 ఎగ్జిబిట్లు వచ్చాయన్నారు. మంగళవారం ఉత్తమ ఎగ్జిబిట్లను జడ్జీలు ఎంపిక చేస్తారన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో శ్యాంప్రసాద్‌రెడ్డి, ప్రిన్సిపాల్ విష్ణువర్దన్‌రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి మహేందర్, ప్రధానోపాధ్యాయులు గన్నెరాజిరెడ్డి, శ్రీనివాసరావు, రమేశ్‌రావు, సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్, వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. అనంతరం సైన్స్ ఫెయిర్‌లో భాగంగా ఎగ్జిబిట్లను కలెక్టర్ కృష్ణభాస్కర్, సీపీ జోయల్ డెవిస్‌లు పరిశీలించారు. ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి.

146
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...