టీఆర్‌ఎస్ నాయకుల ప్రచారం


Sun,November 11, 2018 11:20 PM

దుబ్బాక,నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ ప్రభు దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధ్దితో పాటు సస్యశ్యామలమవుతుందని టీఆర్‌ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు టేకులపల్లి మల్లారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు కొంగరి రాజయ్య అన్నారు. ఆదివారం దుబ్బాక మండలం బల్వంతాపూర్, పద్మశాలిగడ్డ , నర్లేన్‌గడ్డ గ్రామాల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి మద్దతుగా టీఆర్‌ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ గ్రామాల్లో గడపగడపకు తిరిగి టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే సోలిపేటను భారీ మెజార్టీతో గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో అంశాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ నాయకులు టీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. ఇంతకు ముందు బల్వంతాపూర్ మదిర గ్రామమైన పద్మశాలిగడ్డ నేడు నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటు కావటం టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందన్నారు.గ్రామస్వరాజ్యం కోసం తండాలు, గూడెంలు , ఇతర మదిర గ్రామాలను సీఎం కేసీఆర్ గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కాలువతో దుబ్బాక నియోజకవర్గం సస్యశ్యామలమవుతుందన్నారు. గత ప్రభుత్వాలలో చేయలేని అభివృద్ధి పనులు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం నాలుగేండ్లలో చేసి చూపిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్లారెడ్డి, అబ్బుల రాజలింగంగౌడ్, రైతు సమన్వయసమితి మండల కన్వీనర్ వంగ బాల్‌రెడ్డి, నాయకులు పోలబోయిన నారాగౌడ్, లింబాద్రిగౌడ్, రాజ య్య, రాంరెడ్డి, పర్స కృష్ణ, పద్మయ్య, రవి, మల్లేశం, స్వామిగౌడ్, కిషన్, యాదగిరి, లలిత, శ్రీనివాస్, సత్తయ్య తదితరులున్నారు.

148
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...