తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా టీఆర్‌ఎస్


Sun,November 11, 2018 11:20 PM

చేర్యాల, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా పేరుగాంచిందని, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన షాదీముబారక్ పథకం ముస్లింల కుటుంబాల్లో వెలుగులు నింపిందని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఉల్లెంగల ఏకానందం, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ జడ్పీటీసీ ఉల్లేంగల పద్మ అన్నారు. మండలంలోని ఆకునూరులో జరిగిన ఆదివారం ముస్లింల వివాహానికి హాజరై వారికి అభినందనలు తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసిందన్నారు. షాదీముబారక్ పథకంతో వారు సంతోషంగా పెండ్లిల్లు చేస్తున్నారని పేర్కొన్నారు. నాలుగున్నర సంవత్సరాల పాటు ఎలాంటి అవినీతికి తావు లేకుండా పాలన సాగించిన సీఎం కేసీఆర్ పార్టీకి తిరిగి ఓట్లు వేసేందుకు అన్ని వర్గాలు తీర్మాణించుకున్నట్లు పేర్కొన్నారు. రెండు మాసాలుగా కూటమి కట్టిన కాంగ్రెస్ తదితర పార్టీల నాయకులు ఇప్పటికీ కనీసం సీట్లు కేటాయించుకోలేకపోతున్నారని విమర్శించారు. సీట్లు కేటాయించుకోలేని మహాకూటమి అసలు ప్రజలకు ఏం న్యాయం చేస్తుందని ప్రశ్నించారు. ఎన్ని కూటములు కట్టినా సీఎం కేసీఆర్ తిరిగి అధికారం లోకి రావడం ఖాయమన్నారు.

152
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...