నేటినుంచి సైన్స్‌ఫెయిర్


Sun,November 11, 2018 11:19 PM

-ఎన్సాన్‌పల్లి గురుకుల విద్యాలయంలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు
-జిల్లా విద్యాధికారి డా.రవికాంత్‌రావు
- ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
సిద్దిపేట అర్బన్ : మండలపరిధిలోని ఎన్సాన్ పల్లిలో ఉన్న తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో ఈ నెల 12 నుంచి 14 వరకు మూడు రోజుల పాటు జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన (సైన్స్‌ఫెయిర్) నిర్వహిస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) డా.రవికాంత్‌రావు తెలిపారు. ఆదివారం ఎన్సాన్‌పల్లి గురుకుల బాలికల విద్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
46వ జాతీయ సైన్స్ గణిత, పర్యావరణ ప్రదర్శణ అంశంగా జీవితంలో సవాళ్లు - శాస్త్ర వైజ్ఞానిక, సాంకేతిక పరిష్కార మార్గాలు అనే అంశాలపై ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. వ్యవసాయం -సేంద్రియ పద్ధ్దతి, ఆరోగ్యం- పరిశుభ్రత, వనరుల నిర్వాహణ-వ్యర్థాల నిర్వహణ, రవాణా, సమాచార రంగాలు, గణిత నమూనాలు, ఇతర అంశాలు, ఉపాధ్యాయుల బోధనోపకరణాలు, ఛాత్రోపాధ్యాయుల బోధనోపకరణాల ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఆదర్శ, కెజీవీబీ, మైనార్టీ గురుకులాలతో పాటు ప్రైవేట్ పాఠశాలలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నుంచి కూడా వైజ్ఞానికి ప్రదర్శనలు తీసుకురావచ్చని వివరించారు. జిల్లాలో మొత్తం 450కి పైగా ఎగ్జిబిట్లు వస్తాయన్నారు. ప్రాథమికోన్నత, ఉన్నత స్థాయి విద్యార్థుల నుంచి 14 అంశాలు, 2 ఉపాధ్యాయ అంశాల్లో మొత్తం 16 అంశాల్లోని ఉత్తమ ప్రదర్శనలు రాష్ట్రస్థాయికి ఎంపిక అవుతాయని డీఈవో తెలిపారు.

24 నుంచి 27 వరకు రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్
జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్ అనంతరం అనంతరం ఇదే పాఠశాలలో ఈ నెల 24 నుంచి 27 వరకు 4 రోజుల పాటు రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్ నిర్వహిస్తామని డీఈవో డా.రవికాంత్‌రావు తెలిపారు. జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్‌కు వచ్చే విద్యార్థులందరికీ అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. బాలికలకు ఎన్సాన్‌పల్లి గురుకుల విద్యాలయం, బాలురకు తడ్కపల్లిలోని ఆవాస విద్యాలయం లో వసతి ఏర్పాటు చేశామన్నారు. మొదటి రోజు కలెక్టర్ కృష్ణభాస్కర్‌తో పాటు ఇతర జిల్లా అధికారులు హాజరవుతారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పరీక్షల సహాయ సంచాలకుడు శ్యాంప్రసాద్‌రెడ్డి, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ విష్ణువర్ధ్దన్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్‌రావు, రాజిరెడ్డి, రమేశ్‌రావు, సత్యనారాయణరెడ్డి, జిల్లా సైన్స్ ఆఫీసర్ మహేందర్ పాల్గొన్నారు.
చెకుముకి పత్రిక ఆవిష్కరణ
చెకుముకి సైన్స్ సంబురాల్లో భాగంగా జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గోడపత్రికను డీఈవో రవికాంతరావు తో కలిసి నిర్వాహకులు ఆవిష్కరించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్ప థం పెంపొందించడానికి జనవిజ్ఞాన వేదిక నిర్వహిస్తున్న కార్యక్రమాలు బాగున్నాయని డీఈవో అభినందించారు. కార్యక్రమంలో నిర్వా హకులు సత్యం, మహేందర్, శ్యాంప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

132
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...