సీఎం కేసీఆర్‌కే గంగపుత్రుల మద్దతు


Sat,November 10, 2018 11:39 PM

తూప్రాన్ రూరల్ : గజ్వేల్ నియోజకవర్గంలో వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతూ నిరుపేదలకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్‌కే ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని గంగపుత్రుల సంఘం రాష్ట్ర కార్యదర్శి, మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ గడప దేవేందర్ అన్నారు. పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద తెలంగాణ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. అనంతరం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శనివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి తూప్రాన్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన గంగపుత్రుల సంఘం కులస్తులు భారీగా తరలివెళ్లారు. జైజై కేసీఆర్..జైజై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. అనంతరం గడప దేవేందర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సీఎం అయ్యాకే గంగపుత్రులకు సముచిత స్థానాన్ని కల్పించారన్నారు.మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణను చేపట్టడంతో చేపల పెంపకం సులువైందన్నారు. చేపలను పెంచుతూ అమ్మకం ద్వారా వచ్చే లాభాలతో నిరుపేదలైన తమ కుటుంబాలు జీవనం సాగిస్తున్నామన్నారు. సబ్సిడీ ద్వారా చేప పిల్లల పంపిణీ, విక్రయించడానికి గాను తగిన మార్కెట్ వసతి, టాటా ఏసీ, టీవీఎక్స్ వాహనాలను అందజేస్తూ తమకు చేదోడు నిలుస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో గంగపుత్రుల సంఘం ప్రతినిధులు పోచయ్య, యాదగిరితో పాటు వివిధ గ్రామాలకు చెందిన గంగపుత్రులు పాల్గొన్నారు.

భారీ కాన్వాయ్‌తో గజ్వేల్‌కు బయలుదేరిన గంగపుత్రులు, మున్నూరు కాపులు..
గజ్వేల్ పట్టణంలో సీఎం కేసీఆర్‌కు మద్దతుగా శనివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి తూప్రాన్ మండలంలోని మున్నూరు కాపు, గంగపుత్రుల కులస్తులు భారీ కాన్వాయ్‌తో తరలివెళ్లారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి తూప్రాన్ మండలం పోతరాజుపల్లి వరకు ఈ భారీ కాన్వాయ్ కొనసాగింది. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ గడప దేవేందర్, మున్నూరుకాపు సంఘం జిల్లా ప్రధాన శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పెంటయ్య, రాష్ట్ర ప్రతినిధులు గడ్డం ప్రశాంత్‌కుమార్, గడ్డం సుధాకర్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.

149
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...