ఎంపీపీ శ్రీధర్‌కు పరామర్శ


Sat,November 10, 2018 11:38 PM

చేర్యాల, నమస్తే తెలంగాణ: ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్ తండ్రి మేడిశెట్టి నర్సయ్య ఈ నెల 9వ తేదీన మృతి చెందడంతో భువనగిరి ఎంపీ బూర నర్సయ్య, శాసన మండలి విప్ బొడెకుంటి వెంకటేశ్వర్లు, జనగామ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శనివారం ఎంపీపీతో పాటు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మృతికి కారణాలు అడిగి తెలుసుకోవడంతో పాటు కుటంబ సభ్యులకు సంతాపం తెలియజేసి వారిని ఓదార్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సుంకరి సరిత, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అంకుగారి శ్రీధర్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు పెడుతల ఎల్లారెడ్డి, అధికార ప్రతినిధి పుర్మ ఆగంరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నర్ర ఐలయ్య, పట్టణ అధ్యక్షుడు ముస్త్యాల నాగేశ్వర్‌రావు, ఆడెపు చంద్రయ్య, మాజీ ఉపసర్పంచ్ మంచాల కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

పరామర్శించిన శాసన మండలి విప్
ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్ తండ్రి మేడిశెట్టి నర్సయ్య ఈ నెల 9వ తేదీన మృతి చెందడంతో శాసన మండలి విప్ బొడెకుంటి వెంకటేశ్వర్లు శనివారం ఎంపీపీతో పాటు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా విప్ మృతికి కారణాలు అడిగి తెలుసుకోవడంతో పాటు కుటంబ సభ్యులకు సంతాపం తెలియజేసి వారిని ఓదార్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సుంకరిసరిత, టీఆర్‌ఎస్ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సంకరి మల్లేశం, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అంకుగారి శ్రీధర్‌రెడ్డి, అధికార ప్రతినిధి పుర్మ ఆగంరెడ్డి, యూత్ మండల అధ్యక్షుడు శివగారి అంజయ్య, టీఆర్‌ఎస్వీ మండల అధ్యక్షుడు మంగోలు చంటి, మండల ప్రధాన కార్యదర్శి నర్ర ఐలయ్య, పట్టణ అధ్యక్షుడు ముస్త్యాల నాగేశ్వర్‌రావు, మాజీ ఉపసర్పంచ్ మంచాల కొండయ్య, టౌన్ యూత్ అధ్యక్షుడు బుట్టి శ్రీనివాస్,నాయకులు పాక బాలయ్య, ఆడెపు నరేందర్, నాజర్, కొలిపాక వెంకటయ్య, అవుశెర్ల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

122
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...