మాయకూటమిని తరిమికొట్టండి


Fri,November 9, 2018 12:27 AM

జగదేవ్‌పూర్: రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునే అ వినీతిపరులంతా ఒక్కటై, మహాకూటమి పేరుతో ప ల్లెల్లోకి వస్తున్నారని, అలాంటి నాయకులను ప్రజ లు తరిమి కొట్టాలని హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ పిలుపునిచ్చారు. గురువారం అంతాయగూడెం, బీజీవెంకటాపూర్ రాయవరం, పీటివెంకటాపూర్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి గ్రామస్తులు, టీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలుకగా, ఆయా చోట్ల పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయా గ్రామా ల్లో వారు మాట్లాడుతు టీఆర్‌ఎస్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో ఎక్కడికెళ్లినా, ప్రజలు కారు గుర్తు కు, కేసీఆర్‌కు ఓటేస్తామని ప్రజలు స్వచ్ఛందంగా చెబుతున్నారన్నారు. 60 ఏండ్లలో ఏ ప్రభుత్వం చే యని పనులను కేసీఆర్ నాలుగేండ్లలో చేసి చూపించారని, తిరిగి ఆయనే సీఎంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం ఆయా గ్రా మాల్లో కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేరిన కార్యకర్తలకు వారు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో గుండారంగారెడ్డి, జెడ్పీటీసీ రామచంద్రం, రైతుసమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ నాయకులు యాదవరెడ్డి, సుధాకర్‌రెడ్డి, కరుణాకర్, కొండపోచమ్మ దేవాలయ కమిటీ చైర్మన్ ఉపేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు బాలేశంగౌడ్, మధుసూదన్‌రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు మునీర్, నాయకులు పాల్గొన్నారు.

147
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...