కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాలు


Tue,November 6, 2018 11:30 PM

దుబ్బాక,నమస్తే తెలంగాణ: ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేసి, కంటి సమస్యలున్న కంటి అద్దాలు అందజేస్తున్నారు. సమస్య తీవ్రంగా ఉన్నా వారికి శస్త్ర చికిత్సకు తరలిస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఇప్పటివరకు 55,679 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 8,171 మందికి కండ్లద్దాలు అందజేశారు. 3,416 మందిని శస్త్ర చికిత్సకు తరలించారు. మరో 6,750 మందికి కంటి అద్దాలను బుక్ చేశారు. మంగళవారం దుబ్బాక మండలంలోని పద్మనాభంపల్లిలో కంటి వెలుగు శిబిరాన్ని వైద్యాధికారి స్వాతి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ శిబిరంలో 211 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 17 మందికి కండ్లద్ద్దాలు అందజేశారు. 26 మందిని శస్త్ర చికిత్సకు తరలించారు. మిరుదొడ్డి మండలంలో మల్లుపల్లిలో ప్రారంభించిన శిబిరంలో 252 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 44 మందికి అద్దాలు, 21 మందికి శస్త్ర చికిత్సకు తరలించారు. దౌల్తాబాద్ మండలం ఉప్పరపల్లిలో 250 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 70 మందికి అద్దాలు అందజేశారు.

రాయపోల్ మండలం మంతూర్‌లో 272 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 53 మందికి అద్దాలు అందజేశారు. తొమ్మిది మందిని శస్త్ర చికిత్సకు తరలించారు. తొగుట మండలం పెద్దమసాన్‌పల్లిలో 215 మందికి పరీక్షలు చేశారు. ముగ్గురుకి కండ్లద్దాలు, ఆరుగురిని శస్త్ర చికిత్సకు తరలించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు రాణి, స్వాతి, శ్రీధర్, స్వరూప, రాజేశ్, వెంకటేశం, సూపర్‌వైజర్ మరియా, సిబ్బంది గణేశ్, రాజ్‌చైతన్య, శ్యామల, ఏఎన్‌ఎంలు, సిబ్బంది, ఆశ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

166
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...