ఘనంగా ఆయుర్వేద దినోత్సవం


Mon,November 5, 2018 11:52 PM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : ఆరోగ్య సంరక్షణ, ఔషధాల విషయంలో ప్రపంచ దేశాలతో పోల్చితే.. మన భారతదేశమే గొప్పదని కలెక్టర్ కృష్ణభాస్కర్ తెలిపారు. సోమవారం మూడవ జాతీయ ఆయుర్వేదదినోత్సవాన్ని, భగవాన్ ధన్వంతరి జయంతి వేడుకలను పురస్కరించుకొని జిల్లా కేంద్రమైన సిద్దిపేట ఎన్‌జీవో భవనంలో ఆయుర్వేద శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ 30 నుంచి 40 ఏండ్ల ముందు ఔషధాల విషయంలో ఇతర దేశాలు మేమే గొప్ప అనే వారమని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని భారతదేశంలోని ఆయుర్వేదంపై సదాభిప్రాయంతో ఉన్నారని పేర్కొన్నారు. క్యాంపునకు వచ్చిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి ఉదయం 8.30 గంటలకు ఆయుర్వేద వాక్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక హైస్కూల్ నుంచి ఎన్‌జీవో భవన్ వరకు ఈ వాక్ కొనసాగింది. ఈ మేరకు ఆయుర్వేదం - ప్రజారోగ్యం అంశంపై ప్రభుత్వ పాఠశాలలో 500 నుంచి 600 మంది విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలో గెలుపొందిన వారికి కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ వైద్య శిబిరంలో 100 మందికి షుగర్ రక్త పరీక్షలు చేసి ఉచితంగా ఆయుర్వేద మందులు పంపిణీ చేశారు. ఆయుర్వేద వైద్యఛ ంపై ఔషధ మొక్కల ద్వారా ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించడంతో విశేష స్పందన వచ్చిందని వైద్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఆయుర్వేద ఉచిత మెగా వైద్య శిబిరంలో 500మంది వరకు పాల్గొన్నారని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డీవో జయచంద్రారెడ్డి, డాక్టర్ దీపాంజలి, ఉపాధ్యాయులు రమేశ్‌రావు పాల్గొన్నారు.

147
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...