అర్హులందరూ ఓటు హక్కును పొందాలి


Sun,November 4, 2018 11:36 PM

తొగుట : మీపేరు.. యాదగిరి సార్, యాదగిరి మీకు ఓటు హక్కు ఉందా?.. ఓటరు లీస్టులో చూసుకున్నావా? అని కలెక్టర్ దేవరకొండ కృష్ణభాస్కర్ ప్రశ్నించారు. ఆదివారం మండల కేంద్రం తొగుటలో బీఎల్‌వో కేంద్రంలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని కలెక్టర్ అకస్మీకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్లతో కలెక్టర్ మాట్లాడారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆదివారం ఓటు హక్కు పరిశీలన అంశంపై స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా తొగుటలో ఓటర్లతో మాట్లాడారు. 18 ఏండ్లు నిండిన వారందరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో పేరు ఉందా? లేదా? ఏమైనా పొరపాట్లు జరిగాయో సరి చూసుకోవాల్సిన బాధ్యత ఓటర్లదేనన్నారు. ఈ నెల 9 వరకు ఓటు హక్కును నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సోమేశ్వర్, తహసీల్దార్ వీర్‌సింగ్ పాల్గొన్నారు.

ఓటరుగా నమోదు చేసుకోవాలి..
చిన్నకోడూరు : ఓటు ఉందని అనే విషయాన్ని ప్రతి ఓటరు తెలుసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కృష్ణభాస్కర్ తెలిపారు. మండలంలో స్పెషల్‌డ్రైవ్ సందర్భంగా ఆయాగ్రామాల్లోని గ్రామస్తులతో కలెక్టర్.. ఓటు నమోదు విషయాలను అడిగి తెలుసుకున్నారు. 18ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓ టరుగా నమోదు చేసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రా లవారీగా ఓటరు జాబితాలను పరిశీలించారు. జాబి తాలో పేరు లేకపోతే ఓటరుగా నమోదు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో జయచంద్రారెడ్డి, తహసీల్దార్ రాజిరెడ్డి ఉన్నారు.
పిడిచెడ్‌లో పోలింగ్ కేంద్రం పరిశీలన..
గజ్వేల్ రూరల్ : మండల పరిధిలోని పిడిచెడ్‌లోని పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ కృష్ణభాస్కర్ పరిశీలించారు. పిడిచెడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారో స్థానిక ఎన్నికల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఓటింగ్ విధానంలో ఎలాంటి పొరపాట్లు జరుగకుం డా స్థానిక ప్రజలకు ఈవీఎంలపై అవగాహన కల్పించాలని ఎన్నికల అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్‌ఐ అశోక్, ఇతర సిబ్బంది ఉన్నారు.

135
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...