కులవృత్తులకు చేయూతనిచ్చిన ప్రభుత్వం


Wed,September 12, 2018 11:48 PM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : కులవృత్తులకు చేయూతనిచ్చి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికే కులవృత్తుల వారి కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులను ఖర్చు చేస్తున్నదని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని పత్తి మార్కెట్ యార్డులో పాడిపశువులు, గొర్రెల యూనిట్లు, మత్స్యకారులకు పనిముట్లను శాసన మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్, కార్పొరేషన్ చైర్మన్ రాజయ్యయాదవ్‌లతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని వృత్తుల వారికి ప్రాధాన్యతనిస్తూ సమైక్య పాలనలో మరుగునపడిన వృత్తులకు ప్రాణంపోస్తున్నారన్నారు. మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను, రైతులకు పాడి గేదెలు, గొల్లకుర్మలకు గొర్రెలను అందజేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమంకోసం కృషిచేస్తున్నదని అన్ని వర్గాల ప్రజల కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నదన్నారు. టీఆర్‌ఎస్‌కి మళ్లీ మీ దీవెనలు అందించి ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు.

శాసన మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా గేదెలను రైతులకు నచ్చినవే కొనుగోలు చేస్తే వాటికి ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుందన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలు కులవృత్తుల వారిని గుర్తించలేదని, కేవలం ఓటర్లుగానే చూశాయని కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి వృత్తిని బతికించాలనే సబ్సిడీలు అందజేస్తుందన్నారు. 3043 మోపెడ్స్, 103 లగేజీ ఆటోలు, 16 మొబైల్ ఫిష్ అవుట్‌లెట్లు, 26 పోర్టబుల్ ఫిష్ వెండింగ్ కిట్స్, 236 ప్లాస్టిక్ క్రేడ్స్, 82 క్రాఫ్ట్ అండ్ నెట్స్ తదితర పరికరాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు మురళాయాదవ్, జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకయ్య, డీసీసీబీ డైరెక్టర్లు గుండబోయిన వెంకటేశ్వర్లు, ఉడుత మల్లేశం, గొర్ల కాపరుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీహరియాదవ్, మంద లకా్ష్మరెడ్డితో పాటు ఆయా గ్రామాలకు చెందిన రైతులు, వివిధ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

138
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...