చికిత్స పొందుతూ బాలింత మృతి


Tue,September 11, 2018 11:39 PM

సిద్దిపేట టౌన్ : చికిత్స పొందుతూ బాలింత మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దవాఖానలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల వివరాల ప్రకారం.. కొండపాక మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన మన్నెం మమత (25) పురిటి నొప్పుల తో ఈ నెల 5న దవాఖానకు వచ్చింది. వైద్యులు పరీక్షించి ఆమెకు ఆపరేషన్ చేశారు. పండంటి పాపకు మమత జన్మనిచ్చింది. సోమవారం రాత్రి ఒక్కసారిగా జ్వరం, ఆపరేషన్ చేసిన కుట్ల వద్ద నొప్పి వచ్చాయి. ఈ విషయాన్ని వైద్యుల దృష్టికి తీసుకెళ్లగా డాక్టర్ అరుణానాయుడు.. మమతను పరీక్షించి తెల్లరక్తకణాలు తగ్గాయని ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లి చికిత్స చేయగా.. కొంత సేపటికే మమత చనిపోయింది. వైద్య సిబ్బంది పట్టించుకోలేదని, ముందు గా స్పందిస్తే మమత బతికేదని మృతురాలి కుటుంబీకులు ఆరోపించారు. వైద్యుల తీరుకు నిరసనగా దవాఖాన ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఏసీపీ రామేశ్వర్, సీఐలు నందీశ్వర్‌రెడ్డి, ఆంజనేయులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితులు లిఖితపూర్వకంగా రాసిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. వైద్య పరీక్షల్లో నిర్లక్ష్యం చేయలేదని.. తెల్లరక్త కణాలు తగ్గడంతో మమత కు వైద్యం చేసినా.. పరిస్థితి విషమించిందని వైద్యులు చెప్పారు.

150
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...