డ్యామిట్.. కథ అడ్డం తిరిగింది..!


Sun,September 9, 2018 11:16 PM

సిద్దిపేట టౌన్ : చేడుపకురా.. చేడేవు, తాను తీసిన గొతిలో..!? అనే సూక్తులకు ఈ ఘటన నిదర్శంగా నిలుస్తుంది. కల్తీ కల్లుకు వినియోగించే మత్తు పదార్థాన్ని మామ సరఫరా చేస్తున్నాడని నమ్మించబోయి అల్లుడు ఎక్సైజ్ పోలీ సులకు చిక్కాడు. ఈ సంఘటనలో 6 కిలోల 250 గ్రాముల అల్ఫోజోలోమ్ స్వాధీనం చేసుకొని నిందితుడ్ని రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు సిద్దిపేట ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ చాణక్య వివరాలను వెల్లడించారు.
సిద్దిపేటకు చెందిన సంతోష్‌రెడ్డి, రాజలింగారెడ్డిలు మామఅల్లుళ్లు. కాగా, వీరిద్దరి మధ్య ఇటీవల విభేదాలు తలెత్తాయి. దీంతో మామపై పగ తీర్చుకో వాలనే పగతో రాజలింగారెడ్డి పథకం రచించాడు. మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నవాడిగా మామను చిత్రికరిస్తూ.. కేసులో ఇరికించాలని పథకం అమలు చేశాడు. గణేశ్‌నగర్‌లో గుండు అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తి.. కల్లు కల్తీకి విక్రయించే అల్ఫోజోలోమ్, డైజోఫామ్‌లతోపాటు నార్కోటిక్ డ్రగ్ పదార్థాలను సరఫరా చేస్తున్నాడని ఎక్సైజ్ పోలీసులకు అల్లుడు సమాచారం ఇచ్చాడు.

ఈ మేరకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ సూపరింటెండెంట్ పవన్‌కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. గుండు అపార్ట్‌మెంట్‌లో నివసించే సంతోష్‌రెడ్డికి చెందిన కారులో 6 కిలోల 250 గ్రాముల అల్ఫోజోలోమ్, 4 కిలోల క్లోరల్ హై డ్రెడ్, 471 అల్ఫోజోలోమ్ ట్యాబ్లెట్లు పట్టుబడ్డాయి.
పూర్తిస్థాయిలో విచారణ జరుపగా సంతోష్‌రెడ్డిని కావాలనే కేసులో ఇరికించాలని అల్లుడు రాజలింగారెడ్డి పథకం పన్నాడని పోలీసులకు దర్యాప్తులో తేలింది.
మామ సంతోష్‌రెడ్డిని డ్రగ్ కేసులో ఇరికించాలనే పథకంతో దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రాజుగౌడ్ వద్ద నుంచి మత్తు పదా ర్థాలను రాజలింగారెడ్డి కొనుగోలు చేశాడు. వీటిని మామ సంతోష్‌రెడ్డికి చెందిన కారులో పెట్టి, సమాచారం ఇచ్చాడని విచారణలో తెలిసిందని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు రాజలింగారెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించినట్లు సీఐ చాణక్య తెలిపారు. రాజుగౌడ్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడ్ని పట్టు కుంటామని చెప్పారు. సమావేశంలో సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐ సుభాష్, అక్రమ్ అలీమ్, సిబ్బంది రవీందర్, శివకుమార్, విజయ్‌కుమార్, అర్జున్, అశీర్వాదం, యాదగిరి ఉన్నారు.

215
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...