ప్రజలను జాగృత పరిచేందుకే కనువిప్పు


Sun,September 9, 2018 11:15 PM

చేర్యాల, నమస్తే తెలంగాణ : సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను జాగృత పరిచేందుకే పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో కనువిప్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ అన్నారు. మండలంలోని కొత్త దొమ్మాట గ్రామంలో శనివారం రాత్రి చేర్యాల పోలీసుల ఆధ్వర్యంలో కనివిప్పు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కళాజాత బృందం సభ్యులు మూఢనమ్మకాలు, మద్యం తాగడం వల్ల కలిగే నష్టాలు, కుటుంబ కలహాలు, పేకాడడం వల్ల కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు, వరకట్నం సమస్యలు, ఆత్మహత్యలు, వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకోవడం, తదితర అంశాలపై బృందం సభ్యులు బాలు, రాజు, మల్లు, రవీందర్, తిరుమల పాటలు, నాటకం రూపంలో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ నేనుసైతం అనే కార్యక్రమం ద్వారా అన్ని వర్గాల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని గ్రామాలు నిఘా నీడలో ఉన్నట్లు తెలిపారు. సమస్యలుంటే 100, 7901100100 వాట్సప్ మెసేజ్ చేయవచ్చన్నారు. వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ లక్ష్మణ్‌రావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

127
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...