అఖండ మెజార్టీతో ముత్తిరెడ్డి గెలువాలని పూజలు


Sun,September 9, 2018 11:15 PM

చేర్యాల, నమస్తే తెలంగాణ : తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జనగామ నియోజకవర్గం నుంచి తిరిగి అఖండ మెజార్టీతో విజయం సాధించాలని, సీఎం కేసీఆర్ తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతూ.. పట్టణంలో టీఆర్‌ఎస్ నా యకులు ఆదివారం గ్రామ దేవతల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవార్ల వద్ద మహిళలు బోనాలు సమర్పించిన అనంతరం నాయకులు కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభ్యర్థులను ముందుగా ప్రకటించి చరిత్ర సృష్టించినట్లు తెలిపారు. ఎన్ని పార్టీలు ఏకమైనా టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని, ప్రతిపక్షాలకు తెలంగాణలో చోటు దక్కదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్, టీఆర్‌ఎస్ బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుంకరి మల్లేశం, రాష్ట్ర నాయకులు ముస్త్యాల బాల్‌నర్సయ్య, జిల్లా నాయకులు ఎర్రోల్ల రామచంద్రం, తాడెం కృష్ణమూర్తి, రాళ్లబండి గురుమూర్తి, మండల ప్రధాన కార్యదర్శి నర్ర ఐలయ్య, కర్రోల్ల ఎలీషా, సీనియర్ నాయకుడు ఆడెపు చంద్రయ్య, యూత్ నాయకులు ఆడెపు నరేందర్, రంగు శివశంకర్‌గౌడ్, మాజీ సర్పంచ్ అవుశెర్ల యాదయ్య, పాల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

148
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...