భక్తిశ్రద్ధలతో గ్రామ దేవతలకు బోనాలు


Sun,September 9, 2018 11:15 PM

చేర్యాల, నమస్తే తెలంగాణ : పట్టణంలో ఆదివారం గ్రామ దేవతలకు అన్ని వర్గాల ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రావణ మాసం చివరి ఆదివా రం సందర్భంగా పట్టణ ప్రజలు పోచమ్మ, ఎర్ర పోచమ్మ, ముత్యాలమ్మ, మరి కొన్ని వర్గాలు బీరప్ప, పెద్దమ్మకు బోనాలు సమర్పించారు. ఈ నెల 7వ తేదీన బండ్ల బోనాలతో ప్రారంభమైన పండుగ గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడంతో ముగిసింది. బోనాల పండుగ సందర్భం గా మున్సిపాలిటీ కార్యాలయ అధికారులు, సిబ్బంది ఆయా ఆలయా ల వద్ద ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు తదితర ఏర్పాట్లు చేశారు.
లద్నూర్‌లో పోచమ్మకు బోనాలు
మద్దూరు : లద్నూర్‌లో కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మకు బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఒగ్గు కళాకారుల డోలు చప్పుళ్లతో శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాల మధ్య మహిళలు ఊరేగింపుగా వెళ్లి పోచమ్మకు బోనాలను సమర్పించి మొక్కులను చెల్లించారు. ఒగ్గు కళాకారుల ఆటపాటలు, విన్యాసాలు గ్రామస్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

126
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...