ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం


Sun,September 9, 2018 11:15 PM

మద్దూరు : ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఆదివారం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఉ ద్యోగులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి తహసీల్దార్ శైలజ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్ధి కోసం కాళోజీ నారాయణరావు చేసిన సేవలు మరువలేనివన్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా కాళోజీ అనేక రచనలను చేసినట్లు గుర్తు చేశారు. కాళోజీ నారాయణ రావు ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలన్నారు. కార్యక్రమం లో ఆర్‌ఐ సంతోశ్‌కుమార్, వీఆర్వోలు శ్రీనివాస్, బాలచంద ర్, విజయలక్ష్మి, ఎంసీవో మల్లేశం, వీఆర్‌ఏలు పాల్గొన్నారు.
కొమురవెల్లిలో..
కొమురవెల్లి : పద్మభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు తెలంగాణ సాంస్కృతిక కళాకారుడు పి న్నింటి రత్నం ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిన్నింటి రత్నం మాట్లాడుతూ పుట్టుక తనదైన బ్రతుకంతా తెలంగాణకే అని చాటి చెప్పిన గొ ప్ప కవి కాళోజీ నేటి కవులకు దిక్సూచి అన్నాడు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గీస భిక్షపతి, మల్లన్న ఆలయ డైరెక్టర్ ముత్యం నర్సింలుగౌడ్, మాజీ సర్పంచ్‌లు పడిగన్నగారి మల్లేశం, గొల్లపల్లి కిష్టయ్య, టీఆర్‌ఎస్వీ మండల అధ్యక్షుడు ఏర్పుల మహేశ్, నాయకులు బత్తిని నర్సింలుగౌడ్, ఎలికట్టె శ్యామ్, నరేశ్, త ఉన్నారు.
చేర్యాలలో..
చేర్యాల, నమస్తే తెలంగాణ : మండలంలోని కొత్త దొమ్మాట ప్రాథమికోన్న త పాఠశాలలో ఆదివారం కాళోజీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు రామచంద్రమూర్తి స్వీయ రచనా, దర్శకత్వంలో అర్జున్ అనే విద్యార్థి కాళోజీ వేషధారణ.. పలువురిని అకట్టుకుంది. ఈ సందర్భంగా విద్యార్థి చెప్పిన కాళోజీతో కబుర్లు ఆద్యంతం ఉత్సహాంగా సాగింది. కార్యక్రమంలో హెచ్‌ఎం.పి.కొండల్‌రెడ్డి, ఉపాధ్యాయులు రామలింగం, వెంకటేశ్, వేణుగోపాల్, జీవత పాల్గొన్నారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...