డిపాజిట్ల కోసమే ప్రతిపక్షాల ఆరాటం


Sun,September 9, 2018 11:14 PM

-తెలంగాణ మేమే ఇచ్చామంటున్న కాంగ్రెస్ వ్యతిరేకించిన టీడీపీతో పొత్తేంటి..
-అభివృద్ధి వైపే గజ్వేల్ ప్రజల మొగ్గు
-ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి
గజ్వేల్, నమస్తే తెలంగాణ: తెలంగాణ వ్యతిరేక శక్తులుగా ప్రజల ముందు దోషులుగా నిలబడ్డ పార్టీలు కలిసి తెలంగాణను ఉద్ధరిస్తామని ఎన్నికల్లోకి వెళ్లడం విడ్డూరంగా ఉందని తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి అన్నారు. గజ్వేల్‌లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్‌తో కలిసి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రంలోని అన్నివర్గాలు పాల్గొంటే టీడీపీ ఆంధ్రప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యతిరేకించిందని ఆ పార్టీ నాయకులు సైతం మౌనం వహించారన్నారు. అనేక దశాబ్దాలుగా తెలంగాణ కోసం ఉద్యమాలు జరిగిన కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనేక మంది తెలంగాణ వాదులను పొట్టన పెట్టుకుందన్నారు. తెలంగాణకు నిధుల కేటాయింపులో మొండిచేయి చూపిస్తూ ఆంధ్ర అభివృద్ధికి అక్రమం గా పెద్దమొత్తంలో నిధులను తరలించుకుపోయిన కాం గ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు తెలంగాణను మరోసారి మోసం చేయడానికి అధికారం కోసం ఆరాటపడుతున్నాయన్నారు. దశాబ్దాల పాటు జరుగని అభివృద్ధి తెలంగాణ ఏర్పడిన తర్వాత నాలుగేండ్లలో జరిగిందన్నారు. ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టి పూర్తయ్యే దశలో ఉన్నాయని, అవి పూర్తయితే ఆంధ్రకు దీటుగా ఐదేండ్లలోనే తెలంగాణ అన్నపూర్ణగా మారుతుందన్నారు. పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్ రంగాల్లో తెలంగాణ ఇప్పటికే దేశంలోనే ముందు స్థానంలో నిలిచిందని, మౌలిక సదుపాయాలు, ఇతర రంగాల్లో కూడా కేసీఆర్ కేసీఆర్ సారథ్యంలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ మరోసారి పోటీ చేయడం స్థాని క ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎలక్షన్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీలు పోటీలో నిలువడం అవివేకంగా స్థానిక ప్రజలు భావిస్తున్నారన్నారు. గజ్వేల్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిలుపడానికి సీఎం కేసీఆర్ వెంట నియోజకవర్గ ప్రజలు నడువడానికి సిద్ధంగా ఉన్నారని, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు సైతం దీనిని గౌరవించి కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసి తమ గొప్పతనాన్ని చాటుకోవాలన్నారు. కుర్చీ దాహంతో పోటీ చేసే అభ్యర్థులు డిపాజిట్ కోసం ఆరా టం.. పోరాటమే తప్పా ప్రజల గుర్తింపు లభించదని వారి మనస్సుల్లో స్థానం పొందలేరన్నారు. చిన్నచిన్న అంశాలను భూతద్దాంలో పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించాలని ప్రతిపక్ష పార్టీలు చేసే కుతంత్రాలు ఉడకవన్నారు.సమావేశంలో రైతు సమన్వయ సమితి రాష్ట్ర సభ్యులు దేవి రవీందర్, మండల పార్టీ అధ్యక్షులు దుర్గయ్య, బెండెమధు, నాయకులు పాలరమేశ్, ఇస్మాయిల్, కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...