బేగంపేటకు మహర్దశ


Sat,September 8, 2018 11:43 PM

మిరుదొడ్డి : మండలంలోని బేగంపేట గ్రామస్తులు సుధీర్ఘ కాలంగా ఎదురుచూసిన ఏండ్ల నాటి కల రాష్ట్ర ప్రభుత్వం కృషితో సాకారమైం ది. భూంపల్లి గ్రామపంచాయతీ మధిర గ్రామం గా ఉన్న బేగంపేట సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీంతో గ్రామస్తులు ఏ పని అవసరమున్నా భూంపల్లికి కాలినడకన, సైకిళ్లపై వెళ్లేవారు. గ్రామ పంచాయతీకి గ్రామం దూరంగా ఉండడంతో అధికారులు సైతం బేగంపేటపై దృష్టి సారించకపోవడంతో గ్రామం అభివృద్ధికి నోచుకోక గ్రామస్తులు తీవ్రమైన ఇబ్బందులను అనుభవించారు.
రాష్ట్ర ప్రభుత్వం బేగంపేట గ్రామాన్ని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడంతో గ్రామస్తులందరిలో నూతన ఉత్సాహం నెలకొంది. ఇటీవల బేగంపేట నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రారంభించారు. గ్రామ స్తులందరూ కలిసికట్టుగా ఉంటూ.. గ్రా మాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రజలకు ఎమ్మెల్యే సూచించారు. గ్రామ ప్రత్యేక అధికారి గ్రామాభివృద్ధికి కృషిచేయాలని అప్పట్లో ఆదేశించారు.
-గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా మంజూరు చేసే నిధులతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకొని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుంటామని గ్రామస్తులు ముక్తకంఠంతో పేర్కొం టున్నారు. బేగంపేట గ్రామంలో మొత్తం జనాభా 625 ఉండగా, వీరిలో పురుషులు 203 మంది, స్త్రీలు 222 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లు 425 మంది ఉన్నారు.

117
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...