ముగిసిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ క్రీడలు


Sat,September 8, 2018 11:42 PM

వర్గల్: వర్గల్ మండలం నాచగిరిగుట్ట వద్ద మూడు రోజుల పాటు జరిగిన అండర్-14రాష్ట్రస్థాయి వాలీబాల్ క్రీడలు శనివారంతో ముగిశాయి. పాత పది జిల్లాలను కలుపుకొని మొత్తం 20జట్లు ఈ క్రీడాపోటీల్లో పాల్గొన్నారు. శనివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్‌లో బాలికల విభాగంలో నల్లగొండ జట్టు రంగారెడ్డి జట్టుపై 3-1 ఘనవిజయం సాధించింది. బాలుర విభాగంలో మహబూబ్‌నగర్ నిజామాబాద్‌పై 2-1తేడాతో విజయం సాధించింది. క్రీడల్లో విజేతలకు గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ చేతులమీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వాలీబాల్ సెక్రటరీ నర్సింలు, వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు హన్మంతరెడ్డి, జిల్లా వాలీబాల్ ఉపాధ్యక్షులు కొన్యాల రాజిరెడ్డి, క్రీడా ఆర్గనైజింగ్ సెక్రటరీ సుల్తాన్, మాజీ సర్పంచ్‌లు యాదగిరిగౌడ్, గూడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...