మాజీ ఎమ్మెల్యే చినమల్లయ్య కన్నుమూత


Sat,November 11, 2017 10:55 PM

-హైదరాబాద్‌లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన దేశిని..
-బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని పోరాటం
-నాలుగు సార్లు సర్పంచ్‌గా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక
-సంతాపం తెలిపిన మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు కెప్టెన్, వినోద్‌కుమార్, ఎమ్మెల్యే సతీష్‌కుమార్
హుస్నాబాద్, నమస్తేతెలంగాణ : బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా అనేక ఉద్యమాలు, పోరాటాలు చేయడంతోపాటు ప్రజాప్రతినిధిగా ప్రజలకు నాలుగు దశాబ్దాల పాటు సేవలందించిన ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే దేశిని చినమల్లయ్య(85) శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో గుండెపోటు తో మృతిచెందారు. చినమల్లయ్య మృతితో స్వగ్రామం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామం లో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇందుర్తి నియోజకవర్గ పరిధిలోని చిగురుమామిడి, హుస్నాబాద్, కోహెడ, బెజ్జంకి మండలాలకు సుపరిచితుడు కావడంతో ఆయా మండలాల నుంచి వివిధ పార్టీల నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో శనివారం హైదరాబాద్‌కు తరలివెళ్లి దేశిని మృతదేహం వద్ద నివాళులర్పించారు. స్వాతం త్య్ర సమరయోధుడిగా, సర్పంచ్‌గా, హుస్నాబాద్ సమితి ఉపాధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా ఇందుర్తి నియోజకవర్గ ప్రజలకు ఎనలేని సేవలందించిన దేశిని మృతితో హుస్నాబాద్ ప్రాంతంలో విషాద ఛా యలు అలుముకున్నాయి. దేశినికి భార్య రాజేశ్వరమ్మతో పాటు నలుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు.

-41ఏండ్ల రాజకీయ ప్రస్థానం...
పేద, సామాన్య గౌడ కుటుంబంలో జన్మించిన దేశిని 1947లో ఉర్దూ మీడియంలో 6వ తరగతి పూర్తి చేశారు. తండ్రి అనారోగ్యానికి గురికావడంతో చదువు మానేసి కల్లుగీత వృత్తిని నిర్వహిస్తూనే అప్పటి తెలంగాణ సాయుధ పోరాటానికి కొరియర్‌గా పనిచేశారు. 1951లో రాజేశ్వరమ్మతో వివాహం జరిగింది. 1953లో సీపీఐ సభ్యత్వం తీసుకున్నారు. అప్పటి నుంచి కార్మికులు, కుల వృత్తుల వారి సమస్యల పరిష్కారానికి అనేక ఉద్యమా లు చేశారు. 1957లో బొమ్మన పల్లి సర్పంచ్‌గా ఎన్నికయ్యా రు. 1978 వరకు 4 సార్లు సర్పంచ్‌గా, హుస్నాబాద్ సమితి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1978, 1985, 1989, 1994 లో వరుసగా ఇందుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సుమారు 48 సంవత్సరాల పాటు సీపీఐలో తిరుగులేని నేతగా ఉన్న దేశిని 2001లో టీఆర్‌ఎస్ ఆవిర్భావం సమయంలో సీపీఐ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. 2004ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 2006లో టీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చి ప్రజా సంఘాలు, జేఏసీ కార్యకలాపాల్లో పాల్గొన్నారు.

-మంత్రి హరీశ్‌రావు, ఎంపీల సంతాపం...
మాజీ ఎమ్మెల్యే దేశిని చినమల్లయ్య మృతి పట్ల భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, బోయిన్‌పల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌లు సంతాపం వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాల పా టు ఎమ్మెల్యేగా ప్రజల మన్ననలు అందుకున్న దేశిని మృతి తీరని లోటు అని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఎమ్మెల్యే కోరుకున్నారు.

దేశిని మృతితో శనివారం ఐదు మండలాల్లో జరగాల్సిన పర్యటనను ఎమ్మెల్యే సతీష్‌కుమార్ రద్దు చేసుకున్నారు. అలాగే, కరీంనగర్ జడ్పీ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, హుస్నాబద్ నగరపంచాయతీ చైర్మన్ చంద్రయ్య, ఎంపీపీ భూక్య మంగ, మార్కెట్ చైర్మన్ లింగాల సాయన్న, టీఆర్‌ఎస్ నేతలు వెంకట్రాంరెడ్డి, బీలూనాయక్, ఎడబోయి న తిరుపతిరెడ్డి, మ్యాక నారాయణ, పచ్చిమట్ల శ్రీనివాస్‌గౌడ్, వివిధ పార్టీల నేతలు మంద పవన్, పెండెల అయిలయ్య, ఆకుల వెంకట్, కేడం లింగమూర్తి, బొలిశెట్టి శివయ్య, కొయ్య డ కొమురయ్య, గడిపె మల్లేశ్ సంతాపం వ్యక్తం చేశారు.

153
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...