మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్


Sat,December 14, 2019 11:25 PM

-సంక్షేమ పథకాలు కాపీ కొడుతున్న కేంద్రం
-మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి
-టీఆర్‌ఎస్‌లో చేరిన రామకృష్ణాడ్డి
-ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు
సంగాడ్డి అర్బన్, నమస్తే తెలంగాణ: ఉద్యమాలు చేసి సాధించిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం కంది మండల కేంద్రానికి చెందిన మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గాడ్డి ముఖ్య అనుచరుడు రామకృష్ణాడ్డి, గ్రామ సర్పంచ్ విమల వీరేశం, ఉపసర్పంచ్ ఖాజాఖురేషి, వార్డు సభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రి హరీశ్‌రావు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు రామకృష్ణాడ్డి అనుచరులు గణేశ్‌గడ్డ నుంచి కంది వరకు బైక్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. రామకృష్ణాడ్డి వెయ్యి మంది అనుచరులతో కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరడం సంతోషకరమని మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఆర్ గార్డెన్‌లో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ గడ్డమీద కాంగ్రెస్, బీజేపీలకు స్థానం లేదని, చెప్పింది చేసి చూపించడం సీఎం కేసీఆర్ నైజం అని అన్నారు.

బీజేపీ కాంగ్రెస్ దొందూ దొందే..
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందుగానే వ్యవహరిస్తున్నాయని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక పోతున్నాయని మంత్రి ఎద్దేవా చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు తెలంగాణ అభివృద్ధిని చూసి వెలుతున్నాయని, రాష్ట్రంలో బీజేపీకి అభివృద్ధిపై చిత్తశుద్ది లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో సంగాడ్డి, పటాన్‌చెరు ప్రాంతాల్లో పరిక్షిశమలు మూత పడితే తెలంగాణ సర్కారు 24 గంటల కరెంట్ ఇచ్చి పరిక్షిశమలను నడిపిస్తుందన్నారు.

ఇంటింటికీ తాగునీరు..
మండల కేంద్రమైన కంది గ్రామంలో ఇంటింటికీ మిషన్‌భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని మంత్రి ప్రకటించారు. అంతేకాకుండా సంగాడ్డి, కంది మండలాలకు త్వరలోనే గోదావరి జలాలతో సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కాళేశ్వరం నీటిని సింగూరులో నింపి పూర్తిస్థాయిలో రైతాంగానికి సాగునీరు, తాగునీరు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామన్నారు. కంది నుంచి శంకర్‌పల్లి వరకు రూ.80 కోట్లతో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం చేసి రవాణా వ్యవస్థను మెరుగుపర్చామన్నారు. రిజివూస్టేషన్ కార్యాలయం, వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల భవనం, యనిమల్ పాలి క్లినిక్ భవనాలు ఉన్నాయని, త్వరలో ఎంపీడీవో, తహసీల్దార్ భవనాలు నిర్మాణం చేస్తామన్నారు. అంతేకాకుండా టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయం నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తామన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి..
త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలోని 8 మున్సిపాలిటీల్లో క్లీన్ స్వీప్ చేయాలని మంత్రి కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నది సీఎం కేసీఆర్ అని గడపగడపకూ వెళ్లి ప్రజలకు వివరించాలని కార్యకర్తలను కోరారు. సమన్వయంతో పనిచేస్తే నియోజకవర్గంలోని సంగాడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలు గులాబీ గూటిలో చేర్చాలని పిలుపునిచ్చారు.

కంది అభివృద్ధికి రూ.30 లక్షలు..
- ఎంపీ కొత్త ప్రభాకర్‌డ్డి
తెలంగాణ హయాంలో నూతన జిల్లాలు, మండలాల విభజనలో కొత్తగా ఏర్పడిన కంది మండల కేంద్రం అభివృద్ధికి ఎంపీ ల్యాండ్స్ నుంచి రూ.30లక్షలు మంజూరు చేస్తాం. జిల్లాలో కంది గ్రామాన్ని ఆదర్శవంతం చేయడానికి పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో అభివృద్ధి చేయడానికి పోటీ పడాలి. రాష్ట్ర సర్కారు చేస్తున్న అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలిచిందని, గ్రామాలు అభివృద్ధిలో పోటీ పడుతూ పరిశువూభతను పాటిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలి.

తాగునీటి కోసం గోదావరి జలాలు..
- మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
కంది పంచాయతీ పరిధిలోని ఐఐటీ వరకు గోదావరి జలాలు వస్తున్నాయని, గ్రామంలోని ప్రతి ఇంటికీ తాగునీటి కోసం గోదావరి జలాలు అందిస్తామని మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ భరోసా ఇచ్చారు. గత ఎన్నికల్లో ప్రజలకు మాయమాటలు చెప్పి, గెలిపించకపోతే కనుమరుగవుతానని మోసపూరిత మాటలతో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో లేరని ఆరోపించారు. సొంత కార్యకర్తలకు అందుబాటులో లేనందువల్ల వారి ఇబ్బందులను పట్టించుకోకపోవడంతో అనుచరులు సైతం టీఆర్‌ఎస్‌లో చేరడం సంతోషకరమన్నారు. పార్టీలో చేరిన కార్యకర్తలు, నాయకులు పదవులను ఆశించకుండా పార్టీ ఆదేశాల మేరకు సామాన్య కార్యకర్తగా పనిచేస్తామని చెప్పడం గొప్ప విషయమని అభినందించారు. పార్టీలో పనిచేసే కార్యకర్తలకు అండగా ఉండి ఆదుకుంటామని మాజీ ఎమ్మెల్యే అన్నారు.

సంగాడ్డి నియోజకవర్గంలో జరిగిన కార్యక్షికమాల్లో జడ్పీ చైర్‌పర్సన్ మంజుశ్రీజైపాల్‌డ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌డ్డి, బీబీపాటిల్, రాష్ట్ర బేవజస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీవూపసాద్, ఎమ్మెల్యే క్రాంతికిరణ్, కలెక్టర్ హనుమంతరావు, జేసీ నిఖిల, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిడ్డి, సంగాడ్డి జడ్పీటీసీ సునీతా, కంది జడ్పీటీసీ కొండల్‌డ్డి, గిరిజన సంక్షేమశాఖ అధికారి మాణమ్మ, డీఎఫ్‌వో వెంక ఐసీడీఎస్ కో-ఆర్డినేటర్ లక్ష్మి, తహసీల్దార్ ఆశా జ్యోతి, మున్సిపల్ కమిషనర్ కమర్ అహ్మద్, టీఆర్‌ఎస్ నాయకులు మనోహర్‌గౌడ్, వెంక చిల్వెరి ప్రభాకర్, హకీం, మాజీ సర్పంచ్ ఆరుట్ల రాంరెడ్డి, టీఆర్‌ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ రాజేందర్‌నాయక్, గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు జైపాల్‌నాయక్, ఎంపీపీ సరళ పుల్లాడ్డి, ఎంపీటీసీ నందకిషోర్, టీఆర్‌ఎస్ నాయకులు మైనార్టీ రాష్ట్ర నాయకులు ఎంఏ.హకీం, శివకుమార్, రషీద్, జైపాల్‌డ్డి, నారాయణయాదవ్, మోహన్‌డ్డి, కృష్ణాగౌడ్, ఆర్ విజయేందర్‌డ్డి, మనోహర్‌గౌడ్, కాసాల బుచ్చిడ్డి, కాసాల రాంరెడ్డి, చిల్వెరి ప్రభాకర్, రాజేందర్‌నాయక్, ఆనంద్‌రావు, మహేందర్, టీఆర్‌ఎస్ సదాశివపేట పట్టణ, మండల అధ్యక్షులు చీల మల్లన్న, పెద్దగొల్ల సత్యనారాయణ, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కాలేద్‌బాబా, నాయకులు సుధీర్‌డ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...