ఈ నెల 16 నుంచి ఇర్ఫానీ దర్గా ఉర్సు


Fri,December 13, 2019 10:31 PM

సంగారెడ్డి రూరల్‌: ఇర్ఫానీదర్గా 17వ ఉర్సు ఉత్సవాలు ఈ నెల 16, 17వ తేదీల్లో నిర్వహించడం జరుగుతుందని ఇర్ఫానీ దర్గా పీఠాధిపతి హకీమ్‌ ఉమర్‌బిన్‌ అహ్మద్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా అఖిల భారత కవి సమ్మేళనం జరుగుతుందన్నారు. దీనికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కవులు అజీజ్‌ బెల్గమి (కర్ణటక), ఖుర్షిద్‌ హైదర్‌ (ముజఫర్‌ నగర్‌), వసీం రాంపురి (యు.పీ) తదితర కవులు పాల్గొననున్నట్టు తెలిపారు. రెండు రోజుల కార్యక్రమంలో వివిధ దర్గాల పీఠాధిపతులు, భక్తులు కులమతాలకు అతీతంగా పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు సజ్జద్‌ నషీన్‌, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...