ఏటీఎంలో డబ్బులు దొంగిలించిన వ్యక్తి అరెస్ట్


Thu,December 12, 2019 11:14 PM

నారాయణఖేడ్ టౌన్ : ఏటీఎంలో నుంచి డబ్బులు డ్రా చేసిస్తానని అమాయకులకు మాయమాటలు చెబుతూ ఏటీఎంలో నుంచి డబ్బులు దొంగిలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు నారాయణఖేడ్ ఎస్‌ఐ సందీప్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మండలం ముస్లాపూర్ తండాకు చెందిన దేవిదాస్ అక్టోబర్ నెల 8వ తేదీన ఉదయం 10.30 గంటలకు నారాయణఖేడ్‌లోని ఐటెక్ ఏటీఎంలో అంజయ్య అనే వ్యక్తి వద్ద కార్డును తీసుకొని డబ్బులు డ్రా చేయిస్తానని చెప్పి పిన్‌నంబర్‌ను తెలుసుకొని ఏటీఎంను బదలాయించి రూ.44వేలు దొంగిలించాడన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఏటీఎంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించి దేవిదాస్‌ను పట్టుకొని రూ.39 వేలు రికవరీ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. ఏటీఎం సెంటర్ల వద్ద ఏటీఎంలను ఎవరికీ ఇవ్వకూడదని, పిన్‌నంబర్‌లను ఎవరికీ చెప్పవద్దని సూచించారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...