గజ్వేల్‌కు శుభదినం


Wed,December 11, 2019 11:55 PM

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : గజ్వేల్‌కు నేడు ఒక శుభదినం.. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు.. గజ్వేల్‌ నియోజకవర్గం రాష్ట్రంతో పాటు దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దినటువంటి నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఏడాదిలో ఇంటింటికీ నీళ్లివ్వకపోతే తాము గెలిచి వృథా అని చెప్పిన సీఎం కేసీఆర్‌, ఏడాదిలో ఇంటింటికీ నల్లాను ఇచ్చి సురక్షిత మంచినీరు అందించారన్నారు. దేశానికే రోల్‌ మోడల్‌గా మిషన్‌ భగీరథ పథకంతో ప్రతి పల్లె, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌, తొలి రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఈ రోజు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలంతా స్వచ్ఛందంగా వచ్చి సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికారన్నారు. ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...