గజ్వేల్‌లో పండుగ వాతావరణం


Wed,December 11, 2019 11:55 PM

గజ్వేల్‌ రూరల్‌ : పట్టణంలో అభివృద్ధి సౌధాల ప్రారంభోత్సవాలతో పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి, గజ్వే ల్‌ శాసనసభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. గజ్వేల్‌ పట్టణంలో నిర్మించిన సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌, ఇంటిగ్రేటేడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌, మహతి ఆడిటోరియం ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌.. గజ్వేల్‌కు వస్తుండడంతో పట్టణమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. పట్టణమంతా సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ బ్యానర్లు, కటౌట్లతో అలంకరించడంతో గులాబీమయంగా మారింది. ప్రజ్ఞాపూర్‌ నుంచి గజ్వేల్‌ ఐవోసీ భవనం, మహతి ఆడిటోరియం వరకు దారిపొడవునా సీఎం కాన్వాయ్‌పై మహిళలు, అభిమానులు పూలవర్షాన్ని కురిపించారు. అడుగడుగా నాయకులు, కార్యకర్తలతోపాటు మహిళలు పెద్దసంఖ్య లో దారికి ఇరువైపులా నిలబడి జై కేసీఆర్‌ అని నినాదాలతో స్వాగతం పలికారు. సీఎం పర్యటన విజయవంతం చేసినందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు.. కార్యకర్తలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రాకకు ముందు కళాకారులు సభను తమ పాటలతో ఉర్రూతలూగించారు. సీఎం పర్యటన ముగిసిన తర్వాత కూడా కళాప్రదర్శనలు కొనసాగడంతో ప్రజలంతా ఆడిటోరియానికి తరలివ చ్చారు. మహతి ఆడిటోరియం వద్ద సెల్పీలు తీసుకుంటూ సం తోషాన్ని వ్యక్తం చేశారు. సీఎం వెళ్లాక.. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, మెప్మా సిబ్బంది సెల్పీలు తీసుకున్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...