ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు


Wed,December 11, 2019 11:55 PM

(సంగారెడ్డి, నమస్తేతెలంగాణ ప్రధానప్రతినిధి)సీఎం కేసీఆర్‌.. గజ్వేల్‌ నియోజక వర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా గజ్వేల్‌కు వచ్చిన సీఎంకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్‌ వెంకట్రాంరెడ్డి, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. గజ్వేల్‌లో సీఎం కాన్వాయ్‌పై ప్రజలు పూల వర్షం కురిపించారు. మొదటగా సీఎం కేసీఆర్‌ ములుగు శివారులోని అటవీ కళాశాలకు చేరుకున్నారు. కళాశాలతో పాటు రీసెర్చ్‌ సెంటర్‌ను సీఎం ప్రారంభించారు. కళాశాల ఆవరణలో మొక్క నాటిన అనంతరం విద్యార్థులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడులోని మెట్టుపాళ్యం కళాశాల మాదిగా ములుగు అటవీ కళాశాల దేశంలో నెంబర్‌-1గా గుర్తింపు పొందాలని సీఎం ఆకాంక్షించారు.

కళాశాల క్యాంపస్‌ ను మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఈటల రాజేందర్‌, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దామోదర గుప్తాతో కలిసి సీఎం పరిశీలించారు.

తరువాత కొండా లక్ష్మణ్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ములుగులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ నిర్వహించిన ఫలప్రదర్శనను సందర్శించారు. ములుగు నుంచి నేరు గా గజ్వేల్‌ చేరుకున్న సీఎం.. నూతనంగా నిర్మించిన సమీకృత మార్కెట్‌ను ప్రారంభించి, వ్యాపారులతో ముచ్చటించారు. సకల హంగులతో నిర్మించిన సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయంతోపాటు మహతి ఆడిటోరియాన్ని ప్రారంభించారు. అలాగే మాతా శిశు సంరక్షణ దవాఖాన, గజ్వేల్‌ మున్సిపాలిటీలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులకు శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమాల్లో పీసీసీఎఫ్‌ ఆర్‌ శోభ, ఎఫ్సీఆర్‌ఐ డీఎన్‌ చంద్రశేర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, సతీశ్‌కుమార్‌, రసమయి బాలకిషన్‌, మండలి చీఫ్‌ విప్‌ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు రఘోత్తంరెడ్డి, ఫారూఖ్‌హుస్సేన్‌, కార్పొరేషన్‌ చైర్మన్లు బాలమల్లు, శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...