ఐటీఐలో అప్రెంటిషిప్ మేళా


Wed,December 11, 2019 04:19 AM

రామచంద్రాపురం : ఆర్సీపురం డివిజన్‌లోని ఐటీఐ కళాశాలలో మంగళవారం అప్రెంటిషిప్ మేళాను నిర్వహించారు. ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు అధిక సంఖ్యలో వచ్చారు. ఉదయం 10.30గంటలకు అప్రెంటిషిప్ మేళాను ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రావు ముందస్తూ ప్రకటన నేపథ్యంలో అభ్యర్థులు వారి ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకుని వచ్చారు. ఈ మేళాలో జేకే ఫెన్నార్, వెంట్ర లోకోమోటివ్స్, హిందుస్థాన్ కోకో కోలా, పెన్నార్, సుశాంత్ ఇంజనీరింగ్ వర్క్స్, థర్మల్ సిస్టమ్స్, మేథాసిస్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, జీటీఎన్ ఇండస్ట్రీయల్ 12 కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఐటీఐ పూర్తి చేసిన సుమారుగా 150మంది అభ్యర్థులు మేళాకు హాజరయ్యారు. అభ్యర్థులు వారికి నచ్చిన కంపెనీల్లో అప్రెంటిషిప్ చేసేందుకు దరఖాస్తులు చేసుకున్నారు. వివిధ కంపెనీల నుంచి వచ్చిన ప్రతినిధులు అభ్యర్థుల దరఖాస్తులతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించారు. అనంతరం అభ్యర్థులను ఇంటర్వ్యూలు చేశారు. అప్రెంటిషిప్ మేళాకు మొత్తం 150 మంది వరకు అభ్యర్థులు పాల్గొనగా సుమారుగా 80మంది అభ్యర్థులు వివిధ కంపెనీల్లో అప్రెంటిషిప్‌ను సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ ఐటీఐ కళాశాలలో నిర్వహించిన అప్రెంటిషిప్ మేళా ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకు ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. ఆయా కంపెనీలు ఒకే చోటకు రావడంతో అభ్యర్థులు వారికి నచ్చిన కంపెనీల్లో అప్రెంటిషిప్ చేసేందుకు ధరఖాస్తులు చేసుకున్నారన్నారు. అప్రెంటిషిప్ మేళాలో ఐటీఐ అభ్యర్థులను నేరుగా అప్రెంటిషిప్‌కు ఎం పిక చేసిన ఆయా కంపెనీల ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఐటీఐ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అప్రెంటిషిప్‌లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో జేఏఏ కరుణాకర్‌రెడ్డి, డీటీవో జయప్రకాశ్, ఎల్‌ఏటీవో విశ్వేశ్వర్, కళాశాల సిబ్బంది ఉన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...