మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు


Sun,December 8, 2019 10:50 PM

చేర్యాల, నమస్తే తెలంగాణ :కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలిరావడంతో మల్లన్న క్షేత్రంలో సందడి నెలకొన్నది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మల్లన్న క్షేత్రానికి 25వేల మంది భక్తులు తరలివచ్చినట్లు అధికారులు వెల్లడించారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు నాలుగు గంటల పాటు వేచి ఉన్నారు. శనివారం రాత్రి క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం వేకువజామున నిద్రలేచి గుండంలో పవిత్ర స్నానం ఆచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం గంగరేగు చెట్టు వద్ద ముడుపులు, పట్నాలు, మరికొందరు తాము బస చేసిన గదుల వద్ద, మహామండపంలో పట్నాలు వేయించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్‌, ఆలయ ఏఈవో రావుల సుదర్శన్‌, పర్యవేక్షకులు నీల శేఖర్‌, ఆలయ ప్రధాన అర్చకుడు మహాదేవుని మల్లికార్జున్‌, ఏఈ బ్రహ్మాండ్లపల్లి అంజయ్య, ప్రతాప్‌, సిబ్బంది బత్తిని పోచయ్య, మేకల పోచయ్య, వైరాగ్యం జగదీశ్వర్‌, కొత్త శ్రీనివాస్‌రెడ్డి, సార్ల విజయ్‌కుమార్‌, నర్సింహులు, మాధవి,అర్చకులు, ఒగ్గు పూజారులు భక్తులకు సేవలందించారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...