టీఈఏ జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస ప్రసాద్‌


Sun,December 8, 2019 10:50 PM

సంగారెడ్డి అర్బన్‌, నమస్తే తెలంగాణ : తెలంగాణ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస ప్రసాద్‌ను నియమించారు. శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు సంపత్‌కుమార్‌ అధ్యక్షతన నిర్వహించి జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్‌ ప్రసాద్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. పదవీ కాలం మూడేండ్లపాటు ఉంటుందని నియామక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీనివాస ప్రసాద్‌ మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ సభ్యుల సహకారం మర్చిపోలేనని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి పాటుపడుతూ శాఖాపరమైన ఇబ్బందులను పరిష్కరించడానికి కృషిచేస్తానని చెప్పారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర సహాయ అధ్యక్షుడు భరత్‌ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బాలస్వామి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నిర్మలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు రాహుల్‌, రమేశ్‌, దేవకి, అంజన్న పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...