లక్ష్యం ఎంచుకుంటే విజయం సొంతం


Sun,December 8, 2019 10:49 PM

నారాయణఖేడ్‌, నమస్తే తెలంగాణ: ప్రతి విద్యార్థి ముం దుగా తమ జీవిత లక్ష్యాన్ని ఎంచుకుని పట్టుదలతో సాధన చేస్తే ఊహించిన విజయాలు సొంతమవుతాయని ఉమ్మడి రాష్ర్టాల ఆదాయపు పన్నుశాఖ ఉప కమిషనర్‌ సుధాకర్‌ నాయక్‌ అన్నారు. ఆదివారం ఖేడ్‌లోని సాంఘిక సంక్షేమ గురుకులంలో హైదరాబాద్‌ ఐఐటీ విద్యార్థులతో కలిసి వ్యక్తిత్వ వికాసంపై విద్యార్థులకు పలు అంశాలను వివరించారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగాలంటే పట్టుదల, శ్రమ అవసరమని, ఇందుకు విద్యార్థులు ముందుగానే లక్ష్యాన్ని ఎంచుకుని ఆ దిశగా అడుగులేయాలన్నారు.

ప్రతి విద్యార్థికి పదో తరగతి, ఇంటర్మీడియట్‌ దశ చాలా కీలకమన్నారు. పదో తరగతి పరీక్షల్లో 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేస్తానని సుధాకర్‌ నాయక్‌ తెలిపారు. ఐఐటీ విద్యార్థులు, స్థానిక విద్యార్థులతో చర్చాగోష్టి నిర్వహించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఐఐటీ విద్యార్థులు రాశిదత్‌, సిద్ధేశ్త్రన్‌సింగ్‌, సాయిరాం భరద్వాజ్‌, గోపికిరణ్‌, గురుకుల ప్రిన్సిపాల్‌ మధుసూదన్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...