పీసీబీ కొత్త సభ్యకార్యదర్శిపై కోటి ఆశలు


Sun,December 1, 2019 11:06 PM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కాలుష్య నియవూతణ మండలి (పీసీబీ) ఏ ముంది చిన్నదే కదా.. పెద్దగా పని ఉండదు అని అందరూ అనుకుంటారు. కానీ లోతుగా చూస్తే గానీ ఎంత పెద్ద సంస్థో బోధపడదు. ఈ బోర్డుకు కొత్త సభ్యకార్యదర్శిగా ఐఏఎస్ అధికారిణి నీతూకుమారీ ప్రసాద్ నియమి తులయ్యారు.

విధి నిర్వహణలో అత్యంత నిక్కచ్చిగా వ్యవహరిస్తారన్న పేరున్న నీతూకుమారీ ప్రసాద్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. అయితే పీసీబీ చరివూతలో బోర్డుకు మెట్టమొదటి మహిళా సభ్యకార్యదర్శిగా నీతూకుమారీ ప్రసాద్ నియమితులు కావడం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రం తీసుకున్నా.. తెలంగాణ తీసుకున్నా ఈమే మొదటి మహిళగా రికార్డుకెక్కారు.

గతంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి జానకి కొండేపి ఆంధ్రవూపదేశ్ పీసీబీ చైర్మన్‌గా వ్యవహరించగా, సభ్యకార్యదర్శులుగా మాత్రం ఐఏఎస్ అధికారులే వ్యవహరించారు. కొత్త సభ్యకార్యదర్శి రాకతో పీసీబీ అధికారుల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఆమె ఎలా వ్యవహరిస్తారు. ఎలా ఉంటారని ఉద్యోగులు ఆరా తీస్తున్నారు. అయితే ఉద్యోగులు, పర్యావరణ వేత్తలు, జనం కొత్త సభ్యకార్యదర్శిపై కోటి ఆశలుపెట్టుకున్నారు. ఆమె రాకతో కొంత మార్పు వస్తుందని ఆశిస్తున్నారు.
బోర్డుకు సంబంధించిన నిధులను ఫలహారం మాదిరిగా పంచిపెడుతున్నారు. మరమ్మతులంటూ.. ఇంకా ఏవో పనులంటూ అవసరం లేని చోట వెచ్చిస్తూ ఖర్చులు చూపిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు.

పదవీ విరమణ పొందిన ఉద్యోగులంతా కాంట్రాక్టు పద్ధతి పేరుతో మళ్లీ ప్రవేశిస్తున్నారు. కాల పరిమితి ముగిసినా, పొడిగించుకుంటూ చెలామణి అవుతున్నారు.
కొంత మంది ఉద్యోగులు తమకు చెందిన ఫైళ్లను తామే రాసుకుంటూ ఉన్నతాధికారుల అనుమతులు తీసుకుంటున్నారు.
సమావేశాల ఖర్చులు, భోజనాలు, టీ, బిస్కెట్లు, స్నాక్స్ కోసం వందల్లో ఖర్చుచేసి, వేలల్లో బిల్లులు సృష్టిస్తున్నారు.
అద్దె వాహనాలు సమకూర్చడం, బిల్లుల మంజూరీలో చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు.
బోర్డు వాహనాలు దుర్వినియోగమవుతున్నాయి. కొంత మంది తమకు వాహనాలు వాడుకునే ప్రొవిజన్ లేకపోయినా బోర్డు వాహనాలను ఎంచక్కా వినియోగించుకుంటున్నారు. మరికొంత మంది బోర్డుకు సంబంధం లేకపోయినా ఇతర సంస్థల్లో పనిచేస్తున్నా బోర్డును ఇష్టారీతిన వాడుకుంటున్నారు. ఆదివారం, సెలవురోజుల్లో, పిల్లలు పరీక్షలు రాయడానికి, పెండ్లిళ్లకు పోవడానికి సైతం బోర్డు వాహనాలనే వాడుకుంటున్నారు.
పలు పారిక్షిశామికవాడల్లో రసాయన వ్యర్థజలాల పారబోతలు యథేచ్ఛగా సాగుతున్నాయి.

ఇలాంటి పరిక్షిశమల గుట్టురట్టుచేసి అరికట్టాల్సి ఉంది.
పలు కెమికల్, ఫార్మా పరిక్షిశమల నుంచి ఘాటువాసనలు వెలువడుతున్నాయి. దీనిపై ఫిర్యాదులందుతున్నాయి.
పీసీబీకి ఆదాయాన్ని సమకూర్చే సెస్సు వసూళ్లలో జాడ్యంపట్టిపీడిస్తున్నది. జలమండలి, దవాఖాన్లు, చెత్త సెస్సులు వసూలుకావడం లేదు.
రూ. 2 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన మొబైల్ టెస్టింగ్‌వ్యాన్, అవేర్‌నెస్ వ్యాన్‌లు నిరుపయోగంగా ఉన్నాయి. ఇప్పటి వరకు మొబైల్ టెస్టింగ్ చేసిన దాఖలులేవు.

బోర్డులో కన్సప్టూంట్లు, బ్రోకర్లు హల్‌చల్ చేస్తున్నారు. వీరి ద్వారా పనులు చక్కబడుతున్న సందర్భాలున్నాయి.
పలు ప్రాంతాల్లో కాలుష్య తీవ్రతలు పరిమితికి మించినమోదవుతున్నాయి. పలు చోట్ల కొత్త కాలుష్య నమోదుకేంవూదాలను ఏర్పాటు చేయాల్సి ఉంది.
వర్క్‌షాప్‌లు, సెమినార్లు, టూర్లు అంటూ పీసీబీ సొమ్ములను వినియోగించుకుంటున్నారు. కాని వాటి ఫలితాలు ఆచరణకు నోచుకోవడం లేదు.
వ్యర్థజలాల ట్యాంకర్లు అక్రమ రవాణా మళ్లీ షురూ అవుతున్నట్లుగా తెలుస్తున్నది. దీనిపై గట్టి నిఘా పెట్టాల్సి ఉంది.
పనిచేస్తున్న కాలుష్య నమోదు పరికరాలను చిన్న చిన్న మరమ్మతులు చేయకుండానే స్క్రాప్‌గా మార్చిపారేస్తున్నారు. కొత్తవి కొనుగోలు చేస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు.
లక్షలు వెచ్చించి ముద్రించిన ప్రచార సామగ్రి, బ్యానర్లు, కరపవూతాలు పలు కార్యాలయాల్లో వృథాపడి ఉంటున్నాయి.
కొంత మంది ఏండ్లకేండ్లు విధులకు ఎగనామం పెట్టి, ఎంచక్కా జీతాలు తీసుకున్నవారు ఉన్నారు. వారికి ముకుతాడు వేయాల్సి ఉంది.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...