ఘనంగా రామాలయ వార్షికోత్సవం..


Sun,December 1, 2019 11:03 PM


గుమ్మడిదల : మండలంలోని రాంరెడ్డిబావి గ్రామ పం చాయతీలోని శ్రీరామాలయ వార్షికోత్సవాన్ని సర్పం చ్ వాసవీదామోదర్‌డ్డి, ఉప సర్పంచ్ ప్రవళిక ఆధ్వర్యం లో ఆదివారం కనుల పండువగా జరిగాయి. చివరి రో జున వేదపండితుల ఆధ్వర్యంలో ఆలయంలో హోమా న్ని నిర్వహించారు. దీనికి తొగుట రాంపూర్ పీఠాధిపతి మాధవానంద సరస్వతీ విశిష్ట అతిథిగా హాజరయ్యారు.

మాధవానంద సరస్వతీ నేతృత్వంలో పూర్ణాహుతితో ముగించారు. అనంతరం సీతారమచంవూదస్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలను నిర్వహించారు. కార్యక్షికమానికి జడ్పీటీసీ కుమార్‌గౌడ్, ఎంపీపీ సద్ది ప్రవీణాభాస్కర్‌డ్డి, టీఆర్‌ఎస్ నాయకులు గోవర్ధన్‌డ్డి, టీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు కాట సుధారాణి, జిన్నారం ఎంపీపీ రవీందర్‌గౌడ్, మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌డ్డి తదితర నాయకులు, నారాయణడ్డి, ప్రవీణ్‌డ్డి, కరుణాకర్‌డ్డ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...