గొల్లకురుమలను ఎస్టీ జాబితాలో చేర్పిస్తా


Sun,December 1, 2019 11:01 PM

-హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ

చేర్యాల, నమస్తే తెలంగాణ : ఇటీవల శంషాబాద్‌లో జరిగిన ఘటన బాధాకరమని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరూ ఖండించాలని హిమాచల్‌వూపదేశ్ గవర్నర్ బండారు దత్తావూతేయ పేర్కొన్నారు. చేర్యాల పట్టణంలోని షాదీఖానలో ఆదివారం చేర్యాల, కొముర మద్దూరు మండలాలకు చెందిన గొల్ల,కురుమ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో గవర్నర్ పాల్గొని మాట్లాడారు.

ప్రధాని నరేంవూదమోడీ వంటి అధినేత నాయకత్వంలో గవర్నర్‌గా నియమించడం తన అదృష్టమని, పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుకునేందుకు పార్టీలకతీతంగా కృషి చేయాలని బండారు దత్తావూతేయ కోరారు.

మహిళలు అన్ని రంగాల్లో ధైర్యంగా ముందుకుసాగాలని, వారు ఎట్టి పరిస్థితుల్లో మనోధైర్యం కోల్పోవద్దని పిలుపునిచ్చారు. గొల్లకురుమలను ఎస్టీ జాబితాల్లో చేర్పించేందుకు తాను కేంద్రంతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. గొల్లకురుమలు చదువుతో పాటు రాజకీయాల్లో రాణించాలని, సమాజ సేవలో ముందుండాలని కోరారు.

యాదాద్రి, కొముర రామప్ప, వెయ్యి స్తంభాల దేవాలయాల అభివృద్ధికి తనవంతుగా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గవర్నర్‌కు తలపాగ చుట్టి గొర్రెపిల్లను అందజేసి ఘనంగా సన్మానించారు.కా ర్యక్షికమంలో గొల్లకురుమల చైతన్య వేదిక రాష్ట్ర కార్యదర్శి తోకల ఉమారాణి, చేర్యాల జడ్పీటీసీ శెట్టె మల్లేశం, మూడు మండలాల నాయకులు పాల్గొన్నారు. గవర్నర్‌ను బీజేపీ నాయకులు శశిధర్‌డ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్, కిరాణ వర్తక సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...