రక్షణగా మేమున్నాం..


Sat,November 30, 2019 11:22 PM

సంగాడ్డి, నమస్తేతెలంగాణ ప్రధానవూపతినిధి : అపరిచిత వ్యక్తులను నమ్మవద్దు. ప్రధానంగా రాత్రి వేళలో వాహనాలు చెడిపోయినప్పుడు లిఫ్ట్ ఇస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో వెళ్లవద్దు. వెళ్లాల్సిన పరిస్థితే వస్తే వాహనంతో పాటు సదరు వ్యక్తి ఫొటోలు తీసుకుని కుటుంబ సభ్యులకు వాట్సాప్ ద్వారా పంపుకోవాలి. లోకేషన్ కూడా షేర్ చేసుకోవాలి. టెక్నాలజీ సాధ్యమైనంత వరకు వినియోగించుకోవాలి.

ఆపదలో ఉన్నామని భావిస్తే వెంటనే 100 నెంబర్‌కు ఫోన్ చేస్తే పోలీసు యంత్రాంగం స్పందించి రక్షణ కల్పిస్తామని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌డ్డి భరోసా ఇచ్చారు. శంషాబాద్ హత్య నేపథ్యంలో ఎవరిని గుడ్డిగా నమ్మవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదే సమయంలో పోలీసులు మీకు రక్షణగా ఉన్నారని ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.

శంషాబాద్ హత్య అత్యంత దారుణమైన ఘటనగా ఎస్పీ అభివర్ణించారు. ఈ క్రమంలో జిల్లాలోని యువతులు, మహిళలు, వృద్ధులు ప్రయాణ సమాయాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుత రోజుల్లో అందరి వద్ద స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని, ఏ ఆపద వచ్చినా తక్షణమే 100 నెంబర్‌కు ఫోన్ చేయాలని మరచిపోవద్దని సూచించారు. మార్గం మధ్యలో వాహనాలు రిపేర్ వచ్చినప్పుడు మహిళలను చూసి గుర్తు తెలియని వ్యక్తులు లిఫ్ట్ ఇస్తామంటారు. వాహనం బాగుచేస్తామని ముందుకు వస్తారు. పరిచయం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అలాంటి వారిని నమ్మవద్దని ఎస్పీ సూచించారు. తను ప్రమాదంలో చిక్కుకుంటున్నానని అనిపించిన వెంటనే ఫోన్ నుంచి లోకేషన్‌తో పాటు గుర్తు తెలియని వ్యక్తులు వారి వాహనాల ఫొటోలు కూడా తల్లిదంవూడులకు, కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు పంపించుకోవాలని చెప్పారు. తప్పని పరిస్థితుల్లో గుర్తు తెలియని ఆటో, క్యాబ్, ప్రైవేట్ కార్లలో వెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా నెంబర్‌తో కూడిన కారు ఫొటోను కూడా వాట్సాప్ ద్వారా పంపాలి. ఎవరిని గుడ్డిగా నమ్మేకాలం కాదు.

చుట్టూ ఉన్న పరిసరాలు, పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలని సూచించారు. ప్రధానంగా మహిళలు, యువతులు, వృద్ధులు ఎవరూ లేని నిర్జన ప్రదేశాల్లో నిలబడడం మంచిది కాదు. జన సంచారం ఉన్నచోటనే ఉండాలి. ఆపదలో 100కు ఫోన్ చేస్తే పెట్రోలింగ్, రక్షక్ పోలీసులు స్పందిస్తారు. అవసరమైతే సంగాడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ : 944090135 కూడా ఫోన్ చేయవచ్చునని ఎస్పీ చంద్రశేఖర్‌డ్డి చెప్పారు. ప్రజలకు రక్షణ కల్పించడానికే పోలీసులు పనిచేస్తున్నారు. మీకు మేం ఉన్నాం అని భరోసా ఇచ్చారు. సంగాడ్డి జిల్లా గ్రేటర్ హైదరాబాద్‌కు సమీపంలో ఉన్నది. ప్రధానంగా ఔటర్ రింగురోడ్డు జిల్లా పరిధిలో ఎక్కువ కిలో మీటర్లు విస్తరించి ఉన్నది. సర్వీసు రోడ్ల మీదుగా రోజు ప్రయాణాలు కొనసాగుతున్నాయి. ఇక్కడే కాకుండా జిల్లాలో ఎక్కడ ఏ ఆపద వచ్చినా 100 ఫోన్ చేయడం మాత్రం మరిచిపోవద్దని ఎస్పీ మరోసారి గుర్తు చేశారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...