నిరంతరంగా ఆర్టీసీ సేవలు


Wed,November 20, 2019 12:45 AM

సంగారెడ్డి అర్బన్, నమస్తే తెలంగాణ: ప్రభు త్వం నిత్యం బస్సుల్లో తమతమ గమ్యస్థానాలు, ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుని బస్సులు తిప్పుతున్నారు. మంగళవారం కూడా ఆర్టీసీ బస్సులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వివిధ ప్రాంతాలకు తిప్పుతూ వారి వారి స్వస్థలాలకు చేర్చుతూ నిరంతర సేవలు అందిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాలో యథేచ్ఛగా బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతూ రవాణాను పరుగులు పెట్టిస్తున్నాయి. మెదక్ రీజియన్ పరిధిలోని మూడు జిల్లాలో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల పరిధిలో 526 బస్సులు ప్రజలకు సేవలందించాయి. 378 ఆర్టీసీ, 148 ప్రైవేట్ బస్సుల ద్వారా ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుం డా వారి వారి స్వస్థలాలకు చేర్చాయి. ప్రయాణాలకు ఇబ్బందులు కలుగకుండా బస్సులను ఆర్టీసీ అధికారులు బస్సులు నడుపుతూ ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతూ ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సమ్మె ప్రభా వం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కడా కనిపించలేదు. అన్ని బస్టాండుల్లో బస్సులు యథేచ్ఛగా తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.

ఉమ్మడి మెదక్ జిల్లాలో తిరిగిన 526 బస్సులు..
మెదక్ రీజియన్ పరిధిలోని మూడు జిల్లాల్లో ఆర్టీసీ అధికారులు 526 బస్సుల ద్వారా ప్రజలను గమ్యస్థానాలకు చేర్చాయి. 378 ఆర్టీసీ, 148 ప్రైవేట్ బస్సులు తిరిగాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న 8డిపోల పరిధిలో ఎలాంటి ఆటం కం లేకుండా బస్సులు తిరుగుతున్నాయి. మెదక్ డిపోలో 47ఆర్టీసీ, 35 ప్రైవేట్ బస్సులు ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చాయి. నారాయణఖేడ్ డిపోలో 40ఆర్టీసీ, 2 ప్రైవేట్ బస్సులు తిరిగాయి. సంగారెడ్డి డిపోలో 75 ఆర్టీసీ, 20 ప్రైవేట్ బస్సులను వివిధ ప్రాంతాలకు తిప్పారు. జహీరాబాద్ డిపోలో 46 ఆర్టీసీ, 21 ప్రైవేట్ బస్సులు ప్రజలకు సేవలందించాయి. సిద్దిపేట డిపోలో 63 ఆర్టీసీ, 35 ప్రైవేట్ బస్సులు తిరిగాయి. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపోలో 48 ఆర్టీసీ, 19 ప్రైవేట్ బస్సుల ద్వారా ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు తరలించాయి. దుబ్బాక డిపోలో 22 ఆర్టీసీ, 4 ప్రైవేట్ బస్సులను తిప్పారు. హుస్నాబాద్ డిపోలో 37 ఆర్టీసీ, 12 ప్రైవేట్ బస్సులు ప్రయాణికులను క్షేమంగా తరలిస్తూ సేవలందిస్తున్నాయి.

కొనసాగుతున్న కార్మికుల నిరసనలు..
ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా కార్మికుల నిరసనలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రం సంగారెడ్డిలో జేఏసీ ఆధ్వర్యంలో కొత్త బస్టాండు ముందు ధర్న కార్యక్రమం నిర్వహించారు. కార్మికులకు ప్రజాసంఘాలు, ఇతర సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించి మద్దతు తెలిపారు. హైకోర్టు కేసును లేబర్ కోర్టుకు బదిలీ చేయడంతో కార్మికులు అందోళనకు గురైయ్యారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను విరమింపజేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...