పుస్తక పఠనం దినచర్యగా మారాలి


Wed,November 20, 2019 12:45 AM

సంగారెడ్డి అర్బన్, నమస్తే తెలంగాణ : సమాజంలో చదువుకున్న వారికి విలువ పెరుగుతుందని, ముఖ్యంగా పుస్తక పఠనంపై దృష్టి సారించాలని డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి అన్నారు. మంగళవారం గ్రంథాలయ జాతీయ వారోత్సవాలలో భాగంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మహిళలు, పాఠశాలల విద్యార్థినులకు వివిధ పోటీలు నిర్వహించి ఆధునిక సమాజం-మానవత విలువలపై అవగాహన కల్పించారు. కార్యక్రమం జిల్లా గ్రంథాలయ కార్యదర్శి వసుంధర, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. మానవీయ విలువలు కాపాడడంలో పుస్తక పఠ నం మార్గదర్శకంగా నిలుస్తాయని గుర్తుచేశారు.విద్యార్థులు అందుబాటులో ఉన్న గ్రంథాలయాలకు వెళ్లి పుస్తకాలు చదువాలన్నారు. నేటి ప్రపంచంలో సాంకేతిక రంగంలో దేశం చిన్న గ్రామంగా మారిందని, తక్కువ సమయంలో సమాచారం చేరిపోతుందన్నారు. అనంతరం నరహరిరెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో మార్పు వచ్చిందని, అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. చిన్నారులు కచ్చితంగా గ్రంథాలయాలను వినియోగించుకుని వక్తలు పాల్గొన్న చర్చాగోష్టిలో మాట్లాడే అంశాలపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో భారతీయ విద్యామందిర్ కరస్పాండెంట్ పూసల లింగాగౌడ్,కూన వేణుగోపాల్, సాయిలు, ఉపాధ్యాయుడు భానుప్రకాశ్, శివాణి, ఫరీద్, చంద్రశేఖర్, కృష్ణ, మధుశర్మ, సిబ్బంది కిషన్, వెంకటరమణ, శ్రీనివాస్, ప్రశాంత్‌కుమార్, సురేశ్‌కుమార్, శోభారాణి, సావిత్రి, కృష్ణమూర్తి, ప్రశాంత్ పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...