పశు సంపదను పెంచుకోవాలి


Wed,November 20, 2019 12:45 AM

హవేళిఘనపూర్ : కృత్రిమ గర్భాధారణ ద్వారా మేలుజాతి పశు సంపదను వృద్ధి చేసుకోవాలని, తద్వారా రైతులు ఆర్థికంగా పాడి పరంగా అభివృద్ధి చెందుతారని ఉమ్మడి మెదక్ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ గణప లకా్ష్మరెడ్డి అన్నారు. మంగళవారం ముత్తాయిపల్లి గ్రామంలో కృషి కల్యాణ్‌యోజన అభియాన్ కార్యక్రమంలో భాగంగా పశువులకు కృత్రిమ గర్భాధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పశువులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం లకా్ష్మరెడ్డి మాట్లాడుతూ మెదక్ జిల్లా పశు సంవర్ధక శాఖ, పశుగణాభివృద్ధి సంస్థ ద్వారా ఈ కార్యక్రమం గత నెల సెప్టెంబర్ 26వ తేదీ నుంచి ఉమ్మడి జిల్లాలో ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 100 గ్రామాలను ఎంపిక చేసి కేంద్రానికి 200 పునరుత్పత్తి యోగ్యమైన పశువులకు ఉచితంగా వైద్య సేవలు, కృత్రిమ గర్భాధారణ గావించి మేలు జాతి దూడల ఉత్పత్తికి తోడ్పాటునందిస్తున్నట్లు ఆయన తెలిపారు. మెదక్ జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రత్యేక సీజన్‌లో ఎదకు వచ్చిన పశువులను గుర్తించి కృత్రిమ గర్భాధారణ చేయించినట్లయితే మేలు జాతి దూడల సంపదను పెంపొందించుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం సమీపంలో ఉన్న గోపాలమిత్ర ద్వారా ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ముత్తాయిపల్లిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మూడు పశువులకు కృత్రిమ గర్భాధారణ, 18 పశువులకు గర్భకోశ వ్యాధుల చికిత్స, 31 పశువులకు సాధారణ చికిత్స, 16 పశువులకు నట్టల నివారణ మందులను అందజేసినట్లు తెలిపారు. జిల్లా పశువైద్యాధికారి అశోక్‌కుమార్, సర్పంచ్ శ్వేత, గ్రామస్తులు విజయారెడ్డి, జేఎన్‌వో సలావుద్దీన్, వీఎల్‌వో శివాజీ, గోపాలమిత్ర సత్యనారాయణ, రైతులు శేఖర్ పాల్గొన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...